ప్రపంచకప్ సెమీస్ లో కొహ్లీ షరా మామూలే

గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ కొహ్లీ ఫ్లాప్ షో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లు శాపంగా మారాయి. కొహ్లీ ఆడిన గత మూడు ప్రపంచకప్ టోర్నీ సెమీస్ లోనూ విఫలం కావటం విశేషం. వన్డే సిరీస్ లు, రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో సెంచరీలతో రికార్డుల మోత మోగించే విరాట్ కొహ్లీకి…ప్రపంచకప్, మినీ ప్రపంచకప్ టోర్నీల కీలక మ్యాచ్ ల్లో విఫలం కావడం ఓ దురలవాటుగా ఉంటూ […]

Advertisement
Update:2019-07-10 16:15 IST
  • గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ కొహ్లీ ఫ్లాప్ షో

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లు శాపంగా మారాయి. కొహ్లీ ఆడిన గత మూడు ప్రపంచకప్ టోర్నీ సెమీస్ లోనూ విఫలం కావటం విశేషం.

వన్డే సిరీస్ లు, రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో సెంచరీలతో రికార్డుల మోత మోగించే విరాట్ కొహ్లీకి…ప్రపంచకప్, మినీ ప్రపంచకప్ టోర్నీల కీలక మ్యాచ్ ల్లో విఫలం కావడం ఓ దురలవాటుగా ఉంటూ వస్తోంది.

2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో కేవలం ఒక్క పరుగు స్కోరుకే అవుటైన కొహ్లీ 2015 ప్రపంచకప్ లో 9 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

ఇక…2019 ప్రపంచకప్ లో సైతం న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో సైతం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. కొహ్లీని కివీ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ .. ఎల్బీడబ్లుగా పడగొట్టాడు.

మొత్తం మీద విరాట్ కొహ్లీ పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా తయారయ్యింది.

Tags:    
Advertisement

Similar News