కాషాయం v/s గులాబీ.... బ‌డ్జెట్‌పై స‌రికొత్త ఫైట్ !

మిష‌న్ భ‌గీర‌థ‌ను బీజేపీ కాపీ కొట్టింది- టీఆర్ఎస్ గుజ‌రాత్ వాట‌ర్ గ్రిడ్‌ను కాపీ కొట్టి మిష‌న్ భ‌గీర‌థ పేరు పెట్టారు – బీజేపీ రైతు బంధు కాపీ కొట్టి పీఎం కిసాన్ ప‌థ‌కం తెచ్చారు- టీఆర్ఎస్‌ కేంద్రం ఆలోచ‌న‌లు ముందే ప‌సిగ‌ట్టి మీరు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు- బీజేపీ కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వేళ సోష‌ల్ మీడియాలో బీజేపీ v/s టీఆర్ఎస్ యుద్ధం న‌డుస్తోంది. ఇంత‌కుముందు’ రైతు బంధు’, ఇప్పుడు ‘మిష‌న్ భ‌గీర‌థ‌’ను స్పూర్తిగా తీసుకుని కేంద్రం ప‌థ‌కాలు […]

Advertisement
Update:2019-07-06 02:22 IST
  • మిష‌న్ భ‌గీర‌థ‌ను బీజేపీ కాపీ కొట్టింది- టీఆర్ఎస్
  • గుజ‌రాత్ వాట‌ర్ గ్రిడ్‌ను కాపీ కొట్టి మిష‌న్ భ‌గీర‌థ పేరు పెట్టారు – బీజేపీ
  • రైతు బంధు కాపీ కొట్టి పీఎం కిసాన్ ప‌థ‌కం తెచ్చారు- టీఆర్ఎస్‌
  • కేంద్రం ఆలోచ‌న‌లు ముందే ప‌సిగ‌ట్టి మీరు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు- బీజేపీ

కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వేళ సోష‌ల్ మీడియాలో బీజేపీ v/s టీఆర్ఎస్ యుద్ధం న‌డుస్తోంది. ఇంత‌కుముందు’ రైతు బంధు’, ఇప్పుడు ‘మిష‌న్ భ‌గీర‌థ‌’ను స్పూర్తిగా తీసుకుని కేంద్రం ప‌థ‌కాలు తీసుకొచ్చింద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

మిష‌న్ భ‌గీర‌థను కాపీ కొట్టి ‘హార్ ఘ‌ర్ జ‌ల‌యోజ‌న’ (ప్ర‌తి ఇంటికి తాగునీరు) ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశార‌ని అన్నారు. మొన్న రైతు బంధు, నేడు మిష‌న్ భ‌గీర‌థ‌, తెలంగాణ ఆద‌ర్శంగా కేంద్ర ప‌థ‌కాలు రూపుదిద్దుకుంటున్నాయ‌ని అన్నారు. అంతేకాకుండా దేశానికి కేసీఆర్ రోల్‌మోడ‌ల్‌లా మారార‌ని చెప్పుకొచ్చారు.

సంక్షేమంలో దేశానికి దిక్సూచి తెలంగాణ అని… కేసీఆర్ మొదలుపెట్టిన సంక్షేమ‌ ప‌థ‌కాలపై దేశవ్యాప్త చ‌ర్చ న‌డుస్తోంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నాయి. కేసీఆర్ ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌ల ఆమోదం ఉంద‌నేందుకు ఇదే సాక్ష్య‌మ‌ని అంటున్నాయి.

ఇదే లెవ‌ల్లో బీజేపీ శ్రేణులు కౌంట‌ర్ ఇస్తున్నాయి. గుజ‌రాత్‌లో అమలు చేస్తున్న ప‌థ‌కాలే కాపీ కొట్టి పేర్లు పెట్టార‌ని వాదిస్తున్నాయి. కేంద్రంలో కొంద‌రు అధికారులు చేసిన ఆలోచ‌న‌ల‌ను ప‌సిగ‌ట్టి ప‌థ‌కాలు ముందు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రం తెచ్చిన బీమా ప‌థ‌కాన్నిమార్చి రైతు బీమా ప‌థ‌కాన్ని తీసుకొచ్చార‌ని దెప్పి పొడుస్తున్నాయి. మిష‌న్ భ‌గీర‌థ పేరేగాని ఇంత‌వ‌ర‌కు నీళ్లే రాలేద‌ని అంటున్నాయి.

ఇటు ఇరుపార్టీల ఫైట్‌పై నెటిజ‌న్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ ప‌థ‌కాలు ఆద‌ర్శంగా తీసుకుంటే పార్ల‌మెంట్ కూల‌గొట్టి కొత్త‌ది క‌డ‌తార‌ని ఎద్దేవా చేస్తున్నారు. ప‌న్నుల క‌డుతున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను రెండు ప్ర‌భుత్వాలు వెర్రివాళ్ళను చేస్తున్నాయ‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు.

మొత్తానికి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన త‌ర్వాత బీజేపీ వాయిస్ పెరిగింది. మీడియా ముందు నేత‌లు పెద్ద‌గా కామెంట్లు చేయ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం కాషాయం v/s పింక్‌గా మారింది. రెండు పార్టీల నెటిజ‌న్ల మ‌ధ్య మాత్రం ఫైట్ హాట్‌హాట్‌గా న‌డుస్తోంది.

Tags:    
Advertisement

Similar News