మన ఆర్థిక మంత్రి.... మనల్నే ముంచేసింది

కేంద్రంలోని ప్రధాని ఉత్తరాది వ్యక్తి…. కీలక నేతలు, మంత్రులు ఉత్తరాది వాళ్ళే…. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం దక్షిణాది ఆమె. అయినా ఏం లాభం? దక్షిణాది పై వివక్ష అలానే కొనసాగింది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు మన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Advertisement
Update:2019-07-05 13:58 IST

కేంద్రంలోని ప్రధాని ఉత్తరాది వ్యక్తి…. కీలక నేతలు, మంత్రులు ఉత్తరాది వాళ్ళే…. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం దక్షిణాది ఆమె. అయినా ఏం లాభం? దక్షిణాది పై వివక్ష అలానే కొనసాగింది.

ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు మన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందని కాంగ్రెస్ ఎంపీ విమర్శించాడు. తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూర్చేలా ఈ బడ్జెట్ లేదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టాడు.

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం అందడం లేదని రేవంత్ విమర్శించారు. బడ్జెట్ లో విద్యా, ఉద్యోగాలకు ఎలాంటి ప్రోత్సాహం లేదని .. లబ్ధి చేకూర్చే పథకాలు లేవని విమర్శించారు.

ఇక దక్షిణాదికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కూడా రేవంత్ ఎండగట్టారు. అతిపెద్ద రాష్ట్రం యూపీ రూ.1 పన్ను చెల్లిస్తే రూ.2 కేంద్రం తిరిగి ఆ రాష్ట్రానికి చెల్లిస్తోందని.. బీహార్ కు రూ.1కి రూ.1 ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించాడు. ఆదాయ పన్నులో పేదలు, మధ్య తరగతికి ఎలాంటి ఉపశమనం లేదని విమర్శించారు. దక్షిణాదికి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దక్షిణాది రాష్ట్రాలనే ముంచేసిందని రేవంత్ దుయ్యబట్టారు.

Tags:    
Advertisement

Similar News