బిర్యానీ కోసం 40వేలు పోగొట్టుకున్న మహిళ
వైట్ కాలర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక మహిళ నాటుకోడి బిర్యాని కోసం ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత 40వేలు పోగొట్టుకుంది. చెన్నైలో ఉంటున్న ప్రియా అగర్వాల్… ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్‌లో బిర్యానీ కోసం ఆర్డర్ చేసింది. బిర్యానీకి 76 రూపాయలను ఆన్‌లైన్ ద్వారానే చెల్లించింది. అయితే బిర్యానీ రాలేదు. కాసేపటికి ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు మేసేజ్ వచ్చింది.దాంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా… 76 రూపాయలు తిరిగి […]
వైట్ కాలర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక మహిళ నాటుకోడి బిర్యాని కోసం ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత 40వేలు పోగొట్టుకుంది. చెన్నైలో ఉంటున్న ప్రియా అగర్వాల్… ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్‌లో బిర్యానీ కోసం ఆర్డర్ చేసింది. బిర్యానీకి 76 రూపాయలను ఆన్‌లైన్ ద్వారానే చెల్లించింది. అయితే బిర్యానీ రాలేదు.
కాసేపటికి ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు మేసేజ్ వచ్చింది.దాంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా… 76 రూపాయలు తిరిగి రావాలంటే 5వేలు చెల్లించాలని.. తిరిగి మీ ఖాతాలోకి 5వేల 76 రూపాయలు జమచేస్తామని అవతలి వ్యక్తి నమ్మించాడు.
అమాయకంగా నమ్మేసిన ప్రియా…. అన్నట్టుగానే ఐదు వేలు బదిలీ చేసింది. కానీ సొమ్ము తిరిగి రాలేదు. మళ్లీ ఫోన్ చేయగా… 5వేల 76 రూపాయలు రావాలంటే మరో ఐదు వేలు జమ చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు.
ఆమె అమాయకంగా ఇలా పదేపదే అవతలి వ్యక్తి చెప్పినట్టుగానే ఐదు వేలు చొప్పున చెల్లిస్తూ 40వేల రూపాయలను పంపించింది. తీరా తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఉబర్ ఈట్స్ కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు.