జగన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి నివాస ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసానికి దాదాపు ఒకటిన్నర కి.లో మీటర్ల పరిధిలో గగనతలం ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిసరాలను ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తున్నారు. 500 మీటర్ల ఎత్తువరకు డ్రోన్‌ కెమెరాలను పంపించి తాడేపల్లి పరిసరాలను చిత్రీకరిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరాలు భారీ భవంతుల మీదుగా పయనిస్తూ తాడేపల్లిని చుట్టి వస్తోంది. కృష్ణా పశ్చిమ కాలువ కట్ట నుంచి దిగువనున్న ముఖ్యమంత్రి నివాస […]

Advertisement
Update:2019-07-04 01:34 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి నివాస ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసానికి దాదాపు ఒకటిన్నర కి.లో మీటర్ల పరిధిలో గగనతలం ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

డ్రోన్ కెమెరాల సాయంతో పరిసరాలను ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తున్నారు. 500 మీటర్ల ఎత్తువరకు డ్రోన్‌ కెమెరాలను పంపించి తాడేపల్లి పరిసరాలను చిత్రీకరిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరాలు భారీ భవంతుల మీదుగా పయనిస్తూ తాడేపల్లిని చుట్టి వస్తోంది.

కృష్ణా పశ్చిమ కాలువ కట్ట నుంచి దిగువనున్న ముఖ్యమంత్రి నివాస మార్గం వైపు వచ్చే వారిని తనిఖీలు చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి నివాసానికి దగ్గరలో ఉండేవారికి సంబంధించిన ఆధార్ వివరాలను సేకరించారు. సీఎంను కలిసేందుకు వచ్చే వారి వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News