వన్డేల్లో 131 పరుగులు, టెస్టుల్లో 106 పరుగులు.... ఇదీ ఎమ్మెస్కే ట్రాక్ రికార్డు

సెలక్షన్ బోర్డు రాజకీయాలకు బలైపోయి మనస్థాపంతో అంబటిరాయుడు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. అయితే ఆశ్చర్యంగా అంబటి రాయుడు రిటైర్‌ అయితే.. ఆయన ప్రొఫైల్‌ కోసం కాకుండా నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్టామినా కోసం అధికంగా వెతుకుతున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. అంబటి రాయుడు క్రికెట్ నుంచి తప్పుకోవడానికి సెలక్టర్ల వైఖరే కారణమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సెలెక్టర్టు కలిసి సాధించిన పరుగుల […]

Advertisement
Update:2019-07-04 02:17 IST

సెలక్షన్ బోర్డు రాజకీయాలకు బలైపోయి మనస్థాపంతో అంబటిరాయుడు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. అయితే ఆశ్చర్యంగా అంబటి రాయుడు రిటైర్‌ అయితే.. ఆయన ప్రొఫైల్‌ కోసం కాకుండా నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్టామినా కోసం అధికంగా వెతుకుతున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది.

అంబటి రాయుడు క్రికెట్ నుంచి తప్పుకోవడానికి సెలక్టర్ల వైఖరే కారణమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సెలెక్టర్టు కలిసి సాధించిన పరుగుల కంటే అంబటి రాయుడి చేసిన స్కోరే అధికమని వ్యాఖ్యానించారు. దాంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ కు సంబంధించిన డేటాను వెతుకుతున్నారు.

చాలా మంది ఆ తర్వాత కంగుతింటున్నారు. ఈయన ఎలా బీసీసీఐకి చీఫ్‌ సెలెక్టర్ అయ్యారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెస్కే ప్రసాద్‌ 17 వన్డే మ్యాచ్‌లు, ఆరు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. వన్డేల్లో ఆయన చేసిన మొత్తం స్కోర్ 131 పరుగులు మాత్రమే. హైఎస్ట్ స్కోర్‌ 63 పరుగులు. ఆరు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ప్రసాద్ సాధించిన పరుగులు కేవలం 106 మాత్రమే. అత్యధిక స్కోర్ 19 మాత్రమే. బౌలింగ్‌ సీనే లేదు.

ఇంతటి దారుణమైన రికార్డు ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌కు … ఇతర ఆటగాళ్ల టాలెంట్‌ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎవరి ద్వారా ఈయన చీఫ్ సెలెక్టర్ అయ్యారంటూ క్రీడాభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏపీకి చెందిన ఒక సామాజికవర్గం నెటిజన్లు అయితే ప్రసాద్‌ కులతత్వానికి అంబటి బలైపోయారంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News