జడ్జీల నియామకంలో కులం, బంధుప్రీతి పెచ్చరిల్లుతోంది " జస్టిస్

న్యాయవ్యవస్థలో చెడుపోకడలపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్‌ పాండే సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకే లేఖ రాశారు. భారత న్యాయవ్యవస్థ బంధుప్రీతి, కులతత్వంతో పెనవేసుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం చాలా దురదృష్టకరమన్నారు. జడ్జీల కుటుంబ సభ్యులే తదుపరి కూడా న్యాయమూర్తులుగా నియమితులవుతున్నారని లేఖలో వివరించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి పాదర్శకమైన వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు మాత్రం బంధుప్రీతి, కులమే ప్రధాన అర్హతలుగా మారిపోయాయని జస్టిస్‌ రంగనాథ్‌ […]

Advertisement
Update:2019-07-03 09:36 IST

న్యాయవ్యవస్థలో చెడుపోకడలపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్‌ పాండే సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకే లేఖ రాశారు.

భారత న్యాయవ్యవస్థ బంధుప్రీతి, కులతత్వంతో పెనవేసుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం చాలా దురదృష్టకరమన్నారు. జడ్జీల కుటుంబ సభ్యులే తదుపరి కూడా న్యాయమూర్తులుగా నియమితులవుతున్నారని లేఖలో వివరించారు.

హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి పాదర్శకమైన వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు మాత్రం బంధుప్రీతి, కులమే ప్రధాన అర్హతలుగా మారిపోయాయని జస్టిస్‌ రంగనాథ్‌ పాండే ఆవేదన చెందారు.

ఏసీ గదుల్లో టీలు తాగుతూ కొత్త న్యాయమూర్తులను… సీనియర్ న్యాయమూర్తులు ఎంపిక చేస్తున్నారని… అంతా రహస్యంగా సాగిపోతోందని… నియామకాలు పూర్తయిన తర్వాతనే కొత్త న్యాయమూర్తుల పేర్లు బయటకు వస్తున్నాయని వివరించారు.

ఏ ప్రాతిపదికన న్యాయమూర్తులు అవుతున్నారు? ఏ అర్హతలతో ప్రమోషన్లు పొందుతున్నారు? అన్నది అర్థం కావడం లేదన్నారు.

న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత రావాలంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుతోనే సాధ్యమని లేఖలో అభిప్రాయపడ్డారు.

కానీ సీనియర్ న్యాయమూర్తులు స్వార్థంలో న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి అంటూ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని రంగనాథ్‌ పాండే ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News