అంబటి రిటైర్మెంట్‌... ఐస్‌లాండ్ ఆహ్వానం...

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్ అంబటి తిరుపతి రాయుడు గుడ్‌బై చెప్పేశారు. తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు ముగింపు పలుకుతున్నట్టు వెల్లడించారు. ఇటీవల జట్టులో జరిగిన పరిణామాలతో మనస్థాపం చెందే అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. వరల్డ్‌ కప్‌లో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడికి అవకాశం దక్కలేదు. ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న వేళ విజయ్‌ శంకర్‌ రూపంలో అవకాశం చేజారిపోయింది. కావాలనే తనను […]

Advertisement
Update:2019-07-03 09:27 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్ అంబటి తిరుపతి రాయుడు గుడ్‌బై చెప్పేశారు. తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు ముగింపు పలుకుతున్నట్టు వెల్లడించారు. ఇటీవల జట్టులో జరిగిన పరిణామాలతో మనస్థాపం చెందే అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు.

వరల్డ్‌ కప్‌లో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడికి అవకాశం దక్కలేదు. ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న వేళ విజయ్‌ శంకర్‌ రూపంలో అవకాశం చేజారిపోయింది. కావాలనే తనను బీసీసీఐ పక్కన పెడుతోందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది.

తెలుగువాడైన అంబటిరాయుడి కెరీక్‌కు మరో తెలుగువాడైన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే పరోక్షంగా దెబ్బ కొట్టారన్న అభిప్రాయం కూడా ఉంది. రాయుడు కంటే విజయ్ శంకరే మూడు రకాలుగా బెటర్ అని ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యానించడంపై రాయుడు వ్యంగ్యంగా స్పందించారు.

త్రీ డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి తాను ప్రపంచ కప్‌ను త్రీడీ కళ్లద్దాలతో చూసేందుకు…. కళ్లజోడు కోసం ఆర్డర్ ఇచ్చానంటూ ఇటీవల రాయుడు ట్వీట్ చేశారు. దాంతో దుమారం రేగింది.

ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలు అంబటిని పూర్తిగా పక్కన పెట్టేశారని టాక్. ఇక ఫలితం లేదని నిర్ధారణకు వచ్చిన అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు.

అంబటి రాయుడు 55 వన్డేలు ఆడారు. 1,694 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్‌ 124.

ఇ‍క తన 17 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 16 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలతో 6,151 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏలో 160 మ్యాచ్ లు ఆడి 5,103 పరుగులు చేశాడు. టీ20ల్లో 1 సెంచరీ, 24 హాఫ్‌ సెంచరీలతో 4,626 పరుగులు సాధించాడు.

అయితే అంబటి రాయుడికి ఐస్‌లాండ్ నుంచి ఆహ్వానం అందింది. త్రీడి గ్లాసెస్ పక్కనపెట్టి … మామూలు అద్దాలతో ముందుకు రండి… వచ్చి మాతో చేరండి. రాయుడంటే మాకెంతో ఇష్టం అని ఐస్‌లాండ్ క్రికెట్…. ట్వీట్ చేసింది. అంబటి రాయుడికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News