ఉత్తరాదిలో వర్షాలు.... ఏపీలో వాయుగుండం

మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆర్ధిక రాజధాని ముంబాయిలో వానల జోరు తగ్గలేదు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా వర్షాలు దడ పుట్టిస్తున్నాయి. ముంబాయిలోని మలాడ్ ఈస్టర్ భారీ వర్షాలకు ఓ గోడకూలి 13 మంది మరణించారు. ముంబైనగరంలో పాత భవనాలు, ఇళ్లలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని, మరీ అవసరమైతే తప్ప ప్రజలు వీధుల్లోకి రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. పాఠశాలలు, […]

Advertisement
Update:2019-07-02 06:05 IST

మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆర్ధిక రాజధాని ముంబాయిలో వానల జోరు తగ్గలేదు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా వర్షాలు దడ పుట్టిస్తున్నాయి.

ముంబాయిలోని మలాడ్ ఈస్టర్ భారీ వర్షాలకు ఓ గోడకూలి 13 మంది మరణించారు. ముంబైనగరంలో పాత భవనాలు, ఇళ్లలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని, మరీ అవసరమైతే తప్ప ప్రజలు వీధుల్లోకి రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

పాఠశాలలు, కళాశాలలకు రెండురోజులు సెలవులు ప్రకటించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముంబై రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా వర్షం నీరే దర్శనమిస్తోంది.

ఇక ముంబాయిలోని మరో చోట కూడా పాఠశాల గోడ కూలి ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. రాష్ట్రంలోని కుంద్వారాలో భారీ వర్షాలకు శనివారం నాడు ఓ గోడ కూలి 17మంది మరణించారు. పాత భవనాల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఇక పూణేలో అంబుద్ నిర్వాదా ప్రాంతంలో కూడా ఓ గోడ కూలి 13 మంది దర్మరణం పాలయ్యారు. క్షతగాత్రలకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు సీఆర్డిఎఫ్ రంగంలోకి దిగింది. అవసరమైతే మిలట్రీ సాయం కూడా తీసుకోవాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.

ఏపీలో వాయుగుండం

ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

సముద్ర తీరానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మంగళవారం నాడు వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తీరప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అదుపుతప్పిన బస్సు: 20 మందికి తీవ్ర గాయాలు

విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారీజీ వద్ద భారీ ప్రమాదం తప్పింది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News