ప్రపంచకప్ లో విరాట్ అరుదైన రికార్డు

వరుసగా ఐదు హాఫ్ సెంచరీల తొలి కెప్టెన్  2015 ప్రపంచకప్ లో స్మిత్..2019 ప్రపంచకప్ లో కొహ్లీ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…ప్రపంచకప్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ 7వ రౌండ్ మ్యాచ్ లో సైతం హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, […]

Advertisement
Update:2019-07-01 02:50 IST
  • వరుసగా ఐదు హాఫ్ సెంచరీల తొలి కెప్టెన్
  • 2015 ప్రపంచకప్ లో స్మిత్..2019 ప్రపంచకప్ లో కొహ్లీ

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…ప్రపంచకప్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ 7వ రౌండ్ మ్యాచ్ లో సైతం హాఫ్ సెంచరీ సాధించాడు.

భారత్ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, ఇంగ్లండ్ జట్లపైన అర్థశతకాలు బాదిన విరాట్ కొహ్లీ..ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఒక్క సెంచరీ సాధించకపోడం విశేషం.

కొహ్లీ కెరియర్ లో ఇది 54వ వన్డే హాఫ్ సెంచరీ కావడం మరో రికార్డు. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక కెప్టెన్ కొహ్లీ మాత్రమే.

2015ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిస్తే…2019 ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ ఐదు హాఫ్ సెంచరీల తొలి కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.

Tags:    
Advertisement

Similar News