నేటినుంచే 133వ వింబుల్డన్ సంబరం

వింబుల్డన్ టాప్ సీడ్లుగా జోకోవిచ్, బార్టీ  9వ టైటిల్ కు గురిపెట్టిన ఎవర్ గ్రీన్ ఫెదరర్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న 133వ వింబుల్డన్ టోర్నీకి లండన్ లోని ఆల్ఇంగ్లండ్ క్లబ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. జులై 1 నుంచి రెండువారాలపాటు సాగే ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, యాష్లీగీ బార్టీ లకు టాప్ సీడింగ్స్ గా టైటిల్ వేటకు దిగుతున్నారు. […]

Advertisement
Update:2019-07-01 02:48 IST
  • వింబుల్డన్ టాప్ సీడ్లుగా జోకోవిచ్, బార్టీ
  • 9వ టైటిల్ కు గురిపెట్టిన ఎవర్ గ్రీన్ ఫెదరర్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న 133వ వింబుల్డన్ టోర్నీకి లండన్ లోని ఆల్ఇంగ్లండ్ క్లబ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

జులై 1 నుంచి రెండువారాలపాటు సాగే ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, యాష్లీగీ బార్టీ లకు టాప్ సీడింగ్స్ గా టైటిల్ వేటకు దిగుతున్నారు.

ఫెదరర్ టైటిల్ వేట…

ఎనిమిదిసార్లు విజేత రోజర్ ఫెదరర్ రెండో సీడ్ హోదాలో 9వ టైటిల్ వేటకు దిగుతుంటే, 12సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ రాఫెల్ నడాల్ మాత్రం..మూడో సీడ్ గా మూడో వింబుల్డన్ టైటిల్ కు గురిపెట్టాడు.

బార్టీకి తొలిసారిగా టాప్ సీడింగ్…

మహిళల సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ యాష్లీగీ బార్టీకి తొలిసారిగా టాప్ సీడింగ్ దక్కింది. డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలికో కెర్బర్ ను 5వ సీడ్ గా నిర్ణయించారు. నవోమీ ఒసాకాకు రెండు, ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ కు 11 సీడ్లు లభించాయి.

టైటిల్ నెగ్గితే 20 కోట్ల 50 లక్షలు

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సర్క్యూట్ లోనే అత్యంత పురాతన టోర్నీ వింబుల్డన్ ప్రైజ్ మనీ మరింత పెరిగింది. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికగా జులై 14 వరకూ జరిగే టోర్నీలో..మొత్తం 309 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది. 2017 వింబుల్డన్ విజేతలకు ఇచ్చిన నగదు బహుమతి కంటే ఇది 7.6 శాతం ఎక్కువ.

విజేతలకు డబ్బే డబ్బు…

పురుషుల, మహిళల సింగిల్స్ లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లకు 20 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీగా అందచేస్తారు. 2017 వింబుల్డన్ విన్నర్ రోజర్ ఫెదరర్ 20 కోట్ల 5 లక్షల రూపాయలు మాత్రమే అందుకొన్నాడు.

2018 టోర్నీ విజేత జోకోవిచ్ 20 కోట్ల 50 లక్షల రూపాయలు సొంతం చేసుకొన్నాడు. వింబుల్డన్ తొలిరౌండ్లోనే ఓటమి పొందిన క్రీడాకారులకు సైతం 35 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందేలా ఏర్పాట్లు చేశారు.

అంతేకాదు…మెయిన్ డ్రా తొలిరౌండ్లో గాయం సాకుతో అర్థంతరంగా వైదొలిగే క్రీడాకారులకు 50 శాతం మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వటానికి వీలుగా ..ఫిఫ్టీ- ఫిఫ్టీ నిబంధన ప్రవేశపెట్టారు.

వింబుల్డన్ లో ఓపెన్ ఎరా ప్రారంభమై ఐదు దశాబ్దాలు పూర్తి కావడం…వింబుల్డన్ లో మహిళా టెన్నిస్ ప్రవేశపెట్టి 126 సంవత్సరాలు కావడం.. వింబుల్డన్ ప్రారంభమై 133 సంవత్సరాలు కావడం కూడా మైలురాళ్లుగా మిగిలిపోనున్నాయి.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో…పచ్చిక కోర్టుల్లో జరిగే ఏకైక టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ మాత్రమే.

Tags:    
Advertisement

Similar News