చంద్రబాబు ఇంటి ముందు మరోవర్గం రైతుల ఆందోళన

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనం వివాదానికి కేంద్రంగా మారింది. తాజాగా మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఈసారి బాబూ.. మీరు ఇక్కడే ఉండాలి అని కాదు… మా భూమి తిరిగి ఇచ్చేయండి అంటూ రైతులు ఆందోళనకు దిగారు. తాజా వివాదంతో లింగమనేని భవనానికి వెళ్లేందుకు వేసిన రోడ్డే ప్రశ్నార్థకమైంది. చంద్రబాబు ఉంటున్న లింగమనేని భవనానికి వెళ్లేందుకు రోడ్డు నిమిత్తం ప్రకాశ్‌, సాంబశివరావు అనే రైతుల నుంచి గత ప్రభుత్వం స్థలం తీసుకుంది. రెండేళ్ల పాటు […]

Advertisement
Update:2019-06-30 13:02 IST

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనం వివాదానికి కేంద్రంగా మారింది. తాజాగా మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఈసారి బాబూ.. మీరు ఇక్కడే ఉండాలి అని కాదు… మా భూమి తిరిగి ఇచ్చేయండి అంటూ రైతులు ఆందోళనకు దిగారు.

తాజా వివాదంతో లింగమనేని భవనానికి వెళ్లేందుకు వేసిన రోడ్డే ప్రశ్నార్థకమైంది. చంద్రబాబు ఉంటున్న లింగమనేని భవనానికి వెళ్లేందుకు రోడ్డు నిమిత్తం ప్రకాశ్‌, సాంబశివరావు అనే రైతుల నుంచి గత ప్రభుత్వం స్థలం తీసుకుంది.

రెండేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటారని.. ఆ తర్వాత సొంత ఇల్లు నిర్మించుకుని మరొక చోటికి వెళ్తారని… అప్పటి వరకు మట్టి రోడ్డు వేస్తామంటూ ఇద్దరు రైతుల పొలాల నుంచి స్థలం తీసుకున్నారు. అలా తీసుకుని పొలాల మధ్యలో రోడ్డు వేశారు.

రెండేళ్ల తర్వాత మట్టి రోడ్డును తీసేసి భూమిని అప్పగిస్తామని ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ రోడ్డుకు పది అడుగుల స్థలం అని చెప్పి 20 అడుగుల స్థలం తీసుకుని రోడ్డు వేశారు. మట్టి రోడ్డు అని చెప్పి తారు రోడ్డు వేశారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లకు సదరు భూమిని తిరిగి రైతులకు ఇవ్వాలి…. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో రైతులు సాంబశివరావు, ప్రకాశ్‌… తోటి రైతులతో కలిసి వచ్చి లింగమనేని భవనం వద్ద ఆందోళనకు దిగారు.

వారికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంఘీభావం తెలిపారు. రెండేళ్లలో భూమి తిరిగి ఇస్తామని టీడీపీ ప్రభుత్వమే లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినందున రైతులకు భూమి తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు.

ఈ నేపథ్యంలో లింగమనేని భవనానికి వెళ్లే రోడ్డు పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. తిరిగి రైతులకు రోడ్డు వేసిన భూమిని అప్పగిస్తే లింగమనేని భవనానికి రాచబాట కూడా దెబ్బతిన్నట్టే.

Tags:    
Advertisement

Similar News