టీమిండియా కాషాయవర్ణం జెర్సీల పై వివాదం

ఇది మోడీ మహిమేనంటున్న ప్రతిపక్షాలు ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్ ల్లో ఆరెంజ్ జెర్సీలు ఆరెంజ్ జెర్సీలు ఆవిష్కరించిన బీసీసీఐ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు.. సాంప్రదాయ నీలివర్ణం జెర్సీలు ధరించి పాల్గొంది. అయితే…సూపర్ సండే ఫైట్ గా ఆతిథ్య ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ తో పాటు… శ్రీలంకతో జరిగే పోటీలో సైతం విరాట్ సేన కాషారంగు జెర్సీలు ధరించి బరిలోకిదిగనుంది. ముంబైలో […]

Advertisement
Update:2019-06-29 05:55 IST
  • ఇది మోడీ మహిమేనంటున్న ప్రతిపక్షాలు
  • ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్ ల్లో ఆరెంజ్ జెర్సీలు
  • ఆరెంజ్ జెర్సీలు ఆవిష్కరించిన బీసీసీఐ

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు.. సాంప్రదాయ నీలివర్ణం జెర్సీలు ధరించి పాల్గొంది.

అయితే…సూపర్ సండే ఫైట్ గా ఆతిథ్య ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ తో పాటు… శ్రీలంకతో జరిగే పోటీలో సైతం విరాట్ సేన కాషారంగు జెర్సీలు ధరించి బరిలోకిదిగనుంది.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరెంజ్ కలర్ జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది.

ప్రతిపక్షాల రాద్ధాంతం…

వన్డే, టీ-20పోటీలలో పాల్గొనే భారత జట్టుకు మెన్ ఇన్ బ్లూ అన్న ముద్దుపేరున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే… ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్, శ్రీలంక జట్లతో జరిగే మ్యాచ్ ల్లో మాత్రం మెన్ -ఇన్- బ్లూ కాస్త…మెన్ ఇన్ ఆరెంజ్ గా మారడాన్ని…ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

అధికార బీజెపీ పార్టీ రంగు కాషాయాన్ని…భారత క్రికెట్ జట్టు జెర్సీలకు సైతం అంటించారని… నరేంద్ర మోదీ ఒత్తిడి కారణంగానే రంగు మారిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

అయితే… భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం…జట్టు జెర్సీ రంగు మారటం వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదని…ఫుట్ బాల్ లో మాదిరిగానే రెండురకాలు, రెండు రంగుల జెర్సీలు ధరించే సాంప్రదాయాన్ని ప్రస్తుత ప్రపంచకప్ నుంచి క్రికెట్లోనూ అమలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

ఆ నాలుగుజట్లకే బ్లూ జెర్సీలు…

ప్రపంచకప్ లో తలపడుతున్న మొత్తం 10 జట్లలో…భారత్, అప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు మాత్రమే బ్లూ కలర్ జెర్సీలు ఉన్నాయి.

అయితే…ఇంగ్లండ్, శ్రీలంక జట్లతో జరిగే మ్యాచ్ ల్లో మాత్రం భారత్…తొలిసారిగా కాషాయవర్ణం జెర్సీలు ధరించి పాల్గోనుంది. జూన్ 30న ఇంగ్లండ్ జట్లతో జరిగే పోటీల్లో మెన్ ఇన్ బ్లూ కాస్త…మెన్ ఇన్ ఆరెంజ్ గా మారనున్నారు.

అఫ్ఘనిస్తాన్ , భారతజట్ల మ్యాచ్ లో …రెండుజట్లూ బ్లూకలర్ జెర్సీలు ధరించే పోటీకి దిగాయి. అయితే…ఇంగ్లండ్, శ్రీలంక జట్లతో జరిగే మ్యాచ్ ల్లో సైతం భారత్…సాంప్రదాయ నీలివర్ణం జెర్సీలే ధరించి పాల్గొంటే వచ్చిన ఇబ్బంది ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

జులై 6న శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో మాత్రం టీమిండియా సాంప్రదాయ బ్లూకలర్ జెర్సీలు ధరిస్తుందా…లేక కాషాయవర్ణం జెర్సీలతో బరిలోకి దిగుతుందా.. వేచిచూడాల్సిందే.

మొత్తం పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ తన తొలిరౌండ్ మ్యాచ్ లో జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News