ఓటమి బాధ్యత నా ఒక్కడిదేనా? " రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఓటమికి తననే బాధ్యుడిని చేస్తూ సీనియర్లు కొందరు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్నికల్లో తానొక్కడినే కష్టపడ్డానని, సీనియర్ నాయకులందరూ పట్టింపు లేకుండా ఉన్నారంటూ సీరియస్ అయ్యారు. “ఎన్నికల ప్రచారంలో ఒక్కడినే కాళ్లకు బలపం కట్టుకుని తిరిగాను. సీనియర్ నాయకులెవ్వరూ సరిగా స్పందించలేదు. ఇప్పుడు ఓటమి బాధ్యతను […]

Advertisement
Update:2019-06-28 01:42 IST

లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఓటమికి తననే బాధ్యుడిని చేస్తూ సీనియర్లు కొందరు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఎన్నికల్లో తానొక్కడినే కష్టపడ్డానని, సీనియర్ నాయకులందరూ పట్టింపు లేకుండా ఉన్నారంటూ సీరియస్ అయ్యారు. “ఎన్నికల ప్రచారంలో ఒక్కడినే కాళ్లకు బలపం కట్టుకుని తిరిగాను. సీనియర్ నాయకులెవ్వరూ సరిగా స్పందించలేదు. ఇప్పుడు ఓటమి బాధ్యతను అధ్యక్షుడిపైనే వేయాలని కొందరు చూస్తున్నారు” అని రాహుల్ గాంధీ పార్టీ అంతర్గత సమావేశంలో మండిపడినట్టు ఓ వార్త సంస్ధ పేర్కొంది.

పలు రాష్ట్ర్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు నామ్ కే వాస్త్ అన్నట్లుగా వ్యవహరించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కాని, ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన తప్పిదాలను కానీ ప్రచారం చేయడంలో సీనియర్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు.

“మనది వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దేశాన్ని ఎన్నో దశాబ్దాల పాటు పాలించిన పార్టీ. ఇప్పుడున్న సీనియర్ నాయకులందరూ అన్ని పదవులు అనుభవించిన వారే. కానీ ఎన్నికల సమయంలో మాత్రం పెదవి విప్పలేదు” అని రాహూల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది.

దేశంలో ఎంతో చరిత్ర ఉన్న పార్టీలో సీనియర్ నాయకులు వ్యవహరించిన తీరు తనను కలచి వేసిందని, దాదాపు అన్ని రాష్ట్రాలలోని సీనియర్లు తమకు పట్టనట్టుగానే వ్యవహరించారని అన్నారు.

“నేనొక్కడినే అన్నింటికి బాధ్యత తీసుకోవాలా..? పార్టీ అధ్యక్షుడిగా తీసుకుంటాను. కాని ఏ ఒక్కరూ వారి పాత్ర వారు పోషించకపోతే నేను ఒక్కడినే పార్టీకి విజయాన్ని ఎలా తీసుకువస్తాను” అని రాహుల్ గాంధీ అన్నారని ఆ వార్తా సంస్ధ పేర్కొంది.

ఈ కారణాలతోనే తాను పార్టీ అద్యక్ష పదవికి దూరంగా ఉన్నానని, కచ్చితంగా తాను తిరిగి అధ్యక్ష పదవిని తీసుకోనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News