వన్డే క్రికెట్లోనూ టాప్ ర్యాంకర్ టీమిండియా

రెండో ర్యాంక్ కు పడిపోయిన ఇంగ్లండ్  5 నుంచి 4వ ర్యాంక్ కు చేరిన ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా… వన్డే క్రికెట్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో నిలకడగా రాణించడం ద్వారా టీమిండియా 123 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకొంది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్, […]

Advertisement
Update:2019-06-27 15:17 IST
  • రెండో ర్యాంక్ కు పడిపోయిన ఇంగ్లండ్
  • 5 నుంచి 4వ ర్యాంక్ కు చేరిన ఆస్ట్రేలియా

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా… వన్డే క్రికెట్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో నిలకడగా రాణించడం ద్వారా టీమిండియా 123 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకొంది.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్లపై విజయాలు సాధించడం ద్వారా టీమిండియా.. తన ర్యాంకింగ్ పాయింట్లను 121 నుంచి 123కు పెంచుకోగలిగింది.

మరోవైపున ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మూడు పరాజయాలు పొందిన ఇంగ్లండ్ నంబర్ వన్ ర్యాంక్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ 122 ర్యాంకింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. 114 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటి వరకూ ఐదోర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం …ప్రపంచకప్ సెమీస్ చేరడం ద్వారా…తన ర్యాంక్ ను..ఓ స్థానం మేర మెరుగు పరచుకుని..నాలుగో ర్యాంక్ లో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News