జగన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం
కృష్ణా నదికి పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం… మిగిలిన కట్టడాల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో అన్ని అక్రమ కట్టడాలపై నోటీసులు జారీ చేయాలని… ఏ ఒక్క కట్టడాన్ని ఊపేక్షించవద్దని ఆదేశించారు. జగన్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. లింగమనేని భవనాన్ని ఖాళీ చేసేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా… పలు నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. వెలగపూడిలోని టీడీపీ మాజీ సర్పంచ్ […]
కృష్ణా నదికి పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం… మిగిలిన కట్టడాల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో అన్ని అక్రమ కట్టడాలపై నోటీసులు జారీ చేయాలని… ఏ ఒక్క కట్టడాన్ని ఊపేక్షించవద్దని ఆదేశించారు. జగన్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. లింగమనేని భవనాన్ని ఖాళీ చేసేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా… పలు నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. వెలగపూడిలోని టీడీపీ మాజీ సర్పంచ్ శాంతకుమారి ఇంటిని ఉమా పరిశీంచారు. ఇంటిని వీడియో తీసి చంద్రబాబుకు పంపించారు. చంద్రబాబు కోసం ఇంటిని ఇచ్చేందుకు శాంతకుమారి ముందుకొచ్చారు. త్వరలోనే ఏదో ఇంటిని ఫైనల్ చేసి ఆ వెంటనే చంద్రబాబు కరకట్టను ఖాళీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఇదే సమయంలో అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్యాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ అనుకూల పత్రికలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటి వరకు కృష్ణా నది కరకట్ట అక్రమ నిర్మాణాలకే పరిమితమైన చర్చను…. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలకు విస్తరించి ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున 100 ఆలయాలు, చర్చిలు ఉన్నాయి అని టీడీపీ పత్రిక వెల్లడించింది. వీటిని కూడా కూల్చగలరా? అన్న సవాల్‌ను ప్రభుత్వం ముందు ఉంచింది. అందులోనూ సదరు పత్రిక…. గోదావరి ఒడ్డున 100 ఆలయాలు, చర్చ్ లు ఉన్నాయి అని చెప్పడం ద్వారా ఈ వ్యవహారాన్ని సున్నితమైన అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.
అటు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ప్రజావేదిక కూల్చివేత కక్ష సాధింపు అన్నారు. ఒకవేళ అక్రమ కట్టడాలను కూల్చాలనుకుంటే నంద్యాలలోనూ అక్రమ కట్టడాలు ఉన్నాయని… వాటిని కూడా కూలుస్తారా? అని ప్రశ్నించారు. నడి రోడ్డుపై బోర్లు వేసినా ఏమీ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ ధోరణి చూస్తుంటే ఇప్పటి వరకు కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాలకు పరిమితమైన చర్చను గోదావరి నదికి, ఆ నది ఒడ్డున ఉన్న ఆలయాలు, చర్చిలకు…. అటు నుంచి ఏపీలోని ప్రతి పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలకు విస్తరించి… ప్రభుత్వంపై భారీ ఒత్తిడి తెచ్చి వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది.