ఖాళీలు 6.84 లక్షలు.. భర్తీ మాత్రం లక్షేనట..!

దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న క్లిష్ట సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాల పెరుగుదల అంతంత మాత్రమే ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి తమకు అర్హమైన ఉద్యోగం పొందడానికి వేచి చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే వీటిలో 2021 నాటికి 1.03 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. […]

Advertisement
Update:2019-06-27 04:16 IST

దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న క్లిష్ట సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాల పెరుగుదల అంతంత మాత్రమే ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి తమకు అర్హమైన ఉద్యోగం పొందడానికి వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే వీటిలో 2021 నాటికి 1.03 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే.. ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైందని ఆరోపిస్తున్నారు.

కాగా, దీనిపై సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అన్ని విభాగాల్లో కలిపి 38.02 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని. గత ఏడాది మార్చి 1 నాటికి 31.18 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ప్రస్తుతం 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఇవన్నీ ఆయా శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణ, మరణాలు, ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలని చెప్పారు.

ఈ ఖాళీలలో అధిక శాతం త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. లక్ష పోస్టులను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తామని.. అలాగే రైల్వే శాఖలో ఉన్న ఉద్యోగాలకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News