ప్రో టెన్నిస్ లో రెండు దశాబ్దాల ఫెదరర్
37 ఏళ్ల వయసులో 9వ వింబుల్డన్ టైటిల్ కు గురి 20 ఏళ్ల కెరియర్ లో 102 ప్రో టైటిల్స్ విన్నర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఎవర్ గ్రీన్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలో ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ సరికొత్త రికార్డుకు ఉరకలేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం ప్రో టెన్నిస్ లో అడుగుపెట్టిన ఫెదరర్ టైటిల్ వెంట టైటిల్ నెగ్గుతూ నిత్యనూతనంగా దూసుకుపోతున్నాడు. లండన్ వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2019 వింబుల్డన్ టోర్నీలో […]
- 37 ఏళ్ల వయసులో 9వ వింబుల్డన్ టైటిల్ కు గురి
- 20 ఏళ్ల కెరియర్ లో 102 ప్రో టైటిల్స్ విన్నర్
- 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఎవర్ గ్రీన్ ఫెదరర్
ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలో ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ సరికొత్త రికార్డుకు ఉరకలేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం ప్రో టెన్నిస్ లో అడుగుపెట్టిన ఫెదరర్ టైటిల్ వెంట టైటిల్ నెగ్గుతూ నిత్యనూతనంగా దూసుకుపోతున్నాడు.
లండన్ వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2019 వింబుల్డన్ టోర్నీలో రెండో సీడ్ గా టైటిల్ వేటకు దిగుతున్నాడు.
9వ వింబుల్డన్ టైటిల్ కు గురి…
ఒకవేళ ఫెదరర్ టైటిల్ నెగ్గితే…37 ఏళ్ల లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిపోతాడు.
వింబుల్డన్ కు సన్నాహకంగా ఇటీవలే ముగిసిన హాలే గ్రాస్ కోర్టు టైటిల్ ను పదోసారి గెలుచుకొన్న ఫెదరర్ కు…గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లోని మొత్తం నాలుగు టైటిల్స్ తో పాటు…20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు ఉంది.
ఈనెల 30 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్ లో ఫెదరర్ మ్యాజిక్ ఎలా ఉంటుందో …వేచిచూడాల్సిందే.