దీనికి రూ. 8.9 కోట్లా?, కూల్చివేతలో తేలిన నాణ్యత
పైన పటారం.. లోన లొటారంలా ఉంది ప్రజావేదిక నిర్మాణం. బయటి నుంచి చూసిన వారు భలే ఉందే అనుకునే వారు. కానీ కూల్చివేత సందర్భంగా ప్రజావేదిక నిర్మాణం అసలు సంగతి తెలుస్తోంది. ఈ నిర్మాణానికి 8.9 కోట్లు ఖర్చు పెట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. తాత్కాలికం పేరుతో ప్రజావేదికను కూడా తూతూ మంత్రంగానే నిర్మించారు. అంతా రెడీమేడ్ తరహాలో నిర్మాణం ఉందే గానీ… శాశ్వత కట్టడంగా, 8.9 కోట్ల విలువ చేసే నిర్మాణంగా ఇది లేదు. అంతా రేకులు, […]
పైన పటారం.. లోన లొటారంలా ఉంది ప్రజావేదిక నిర్మాణం. బయటి నుంచి చూసిన వారు భలే ఉందే అనుకునే వారు. కానీ కూల్చివేత సందర్భంగా ప్రజావేదిక నిర్మాణం అసలు సంగతి తెలుస్తోంది. ఈ నిర్మాణానికి 8.9 కోట్లు ఖర్చు పెట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. తాత్కాలికం పేరుతో ప్రజావేదికను కూడా తూతూ మంత్రంగానే నిర్మించారు.
అంతా రెడీమేడ్ తరహాలో నిర్మాణం ఉందే గానీ… శాశ్వత కట్టడంగా, 8.9 కోట్ల విలువ చేసే నిర్మాణంగా ఇది లేదు. అంతా రేకులు, ఇసుక చువ్వలు, పైపై మెరుగుల కోసం అతికించిన షీట్లు తప్ప ఏమీ లేదు. కూల్చివేత సందర్భంగా ఈ విషయం బయటపడుతోంది. తొలుత 5 కోట్లతో నిర్మాణం మొదలుపెట్టి… నాటి మంత్రి నారాయణ నోటి మాటగా అంచనా వ్యయాన్ని 8.9 కోట్లకు పెంచేసి అమాంతం ప్రజల సొమ్మును నేతలు, కాంట్రాక్టర్లు కలిసి నాకేశారు.
ఒక్క అనుమతి కూడా తీసుకోకుండా నదికి ఆనుకునే కట్టేశారు. పేరుకు ప్రజావసరాల కోసం అని దీన్ని నిర్మించినా… చంద్రబాబు తన పార్టీ కార్యక్రమాలకు వాడుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడే టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ… టికెట్ల ఎంపిక కసరత్తు కూడా ఇక్కడి నుంచే సాగించారు చంద్రబాబు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ ప్రజావేదికలోనే పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు.