అప్పుల కుప్ప తెలంగాణ
బంగారు తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటిమాటికీ చేసే ప్రకటన. అయితే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ రుణ భారం కొండలా పెరిగిపోతూనే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ అప్పుల లెక్కలు విన్న వారికి దిమ్మతిరిగి “అమ్మో తెలంగాణ” అని భయం కలగక మానదు. గడచిన ఐదు సంవత్సరాలలో తెలంగాణ […]
బంగారు తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటిమాటికీ చేసే ప్రకటన. అయితే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ రుణ భారం కొండలా పెరిగిపోతూనే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు.
ఈ అప్పుల లెక్కలు విన్న వారికి దిమ్మతిరిగి “అమ్మో తెలంగాణ” అని భయం కలగక మానదు. గడచిన ఐదు సంవత్సరాలలో తెలంగాణ తల మీద అప్పుల ముప్పు ఏకంగా 159 శాతం పెరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు ఎంఏ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి… అంటే 2014 సంవత్పరానికి 69, 517 కోట్ల రూపాయల అప్పు ఉంది. అది కాస్తా 2019 మార్చి నెల నాటికి 1,80,239 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
విద్యుత్ పంపీణీ సంస్థల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి వీలుగా ఎఫ్ఆర్ బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లుగా మంత్రి తెలిపారు. ఇక 2016-17 సంవత్సరానికి 8,923 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకోవడానికి కూడా కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చిందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2014-15 సంత్సరంలో 79, 880 కోట్ల రూపాయల రుణానికి 5,593 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 2015-16 సంత్సరంలో 97,992 కోట్ల రుణానికి 7,942 కోట్ల రూపాయల వడ్డీ, 2016-17 సంత్సరంలో 1,34,738 కోట్ల రూపాయల అప్పులపై 8,609 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించింది తెలంగాణ ప్రభుత్వం.
2017-18 సంత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 1,51,133 కోట్ల రూపాయల అప్పుకు గాను 11,139 కోట్ల రూపాయల వడ్డీని, 2018-19 సంత్సరంలో 1,80,239 కోట్ల రూపాయల రుణానికి గాను 11,691 కోట్ల రూపాయల వడ్డీని తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు.