కక్షసాధింపు చర్యలొద్దు.... ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజా రంజకమైన పాలన అందించడంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ బదిలీలలో కక్షసాధింపు చర్యలకు, వేధింపులకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులలో […]

Advertisement
Update:2019-06-25 02:45 IST

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజా రంజకమైన పాలన అందించడంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అధికారంలోకి రాగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

ఈ బదిలీలలో కక్షసాధింపు చర్యలకు, వేధింపులకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులలో బదిలీలను కోరుకుంటున్న వారు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలలో విద్యాశాఖను మినహాయించారు. ఆ శాఖకు చెందిన ఉపాధ్యాయులతో పాటు వివిధ ఉద్యోగులను ఈ దఫా బదిలీలలో చేర్చలేదు. దీనికి కారణం ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయని, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడతారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ వారిపై వేటులా కాకుండా వారి ఇష్టాన్ని అనుసరించి జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీలలో ప్రధానంగా ఒకే చోట 5 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులను ముందుగా బదిలీ చేస్తారు. ఇది కూడా పాలనా సౌలభ్యంతో పాటు వ్యక్తిగత అవసరాల నిమిత్తం మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వంలోని అన్ని శాఖలలోనూ జరిగే బదిలీలలో పారదర్శకత ఉండాలని, ఉద్యోగుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకత రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన ఉద్యోగులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు చేపట్టరాదని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News