'కల్కి' కి.... కథ గొడవ !
ఈ మధ్యనే ‘పిఎస్వీ గరుడ వేగ’ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్న రాజశేఖర్…. ఇప్పుడు ‘కల్కి’ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 28న విడుదల కాబోతోంది. అన్ని బాగానే సాగుతున్నాయనుకున్న సమయంలో ఈ సినిమా అనుకోని చిక్కుల్లో పడింది. ఈ మధ్యనే కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే ఒక రచయిత ఈ సినిమా కథ తాను వ్రాసుకున్నది […]
ఈ మధ్యనే ‘పిఎస్వీ గరుడ వేగ’ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్న రాజశేఖర్…. ఇప్పుడు ‘కల్కి’ అనే సినిమాతో రాబోతున్నాడు.
ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 28న విడుదల కాబోతోంది. అన్ని బాగానే సాగుతున్నాయనుకున్న సమయంలో ఈ సినిమా అనుకోని చిక్కుల్లో పడింది. ఈ మధ్యనే కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే ఒక రచయిత ఈ సినిమా కథ తాను వ్రాసుకున్నది అంటూ సినీ రైటర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాడు.
తాను రాసుకున్న కథను ప్రశాంత్ వర్మ కాపీ కొట్టాడని అతని వాదన. ఈ నేపథ్యంలో కథ హక్కుల వేదిక కన్వీనర్ బి.వి.ఎస్.రవి మరియు దర్శకుడు ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ ప్రకారం… ఈ రెండు స్క్రిప్టులకు సంబంధం లేదని రెండు వేరు వేరు అని చెప్పారు.
అంతే కాకుండా రెండు పార్టీలు స్నేహపూర్వకంగానే ఇష్యూ ని సాల్వ్ చేసుకున్నారని, అంతేకాకుండా ఒక వేళ రెండిటి మధ్య ఏమైనా సిమిలారిటీ ఉంటే రైటర్ కి కూడా సినిమాలో క్రెడిట్ దక్కుతుందని మరియు రెమ్యునరేషన్ కూడా లభిస్తుంది అని క్లారిటీ ఇచ్చారు.