జగన్ సత్తాకు బీజేపీ పరీక్ష?
టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీలే కాదు… ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. ఇలా జరిగినా ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఫిరాయించాలంటే జగన్ ప్రభుత్వం తీరే వారికి ఇబ్బందిగా మారింది. ఏపీలో ఎవరైనా సరే పార్టి ఫిరాయిస్తే వేటే అని జగన్ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. మోడీ వద్ద జరిగిన సమావేశంలోనూ అదే స్టాండ్ వినిపించారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే ఏపీ స్పీకర్ వేటు వేస్తారా లేదా అన్నదానిపై చర్చజరుగుతోంది. ఎందుకంటే […]
టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీలే కాదు… ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. ఇలా జరిగినా ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఫిరాయించాలంటే జగన్ ప్రభుత్వం తీరే వారికి ఇబ్బందిగా మారింది. ఏపీలో ఎవరైనా సరే పార్టి ఫిరాయిస్తే వేటే అని జగన్ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు.
మోడీ వద్ద జరిగిన సమావేశంలోనూ అదే స్టాండ్ వినిపించారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే ఏపీ స్పీకర్ వేటు వేస్తారా లేదా అన్నదానిపై చర్చజరుగుతోంది. ఎందుకంటే బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే వైసీపీ, బీజేపీ ప్రభుత్వాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు.
వేటు పడ్డ తర్వాత ఉప ఎన్నికలు కూడా వస్తాయి. అప్పుడు ఈ ఫిరాయింపు దారులకు డిపాజిట్లు కూడా కష్టమే. ఇటీవల ఎన్నికల్లో నోటాతో పోటి పడిన బీజేపీ డిపాజిట్ల స్థాయికి ఎదుగుతుందన్నది అనుమానమే. కాబట్టి ఫిరాయిస్తే వేటు వేసి తీరుతామని జగన్ గానీ, స్పీకర్‌గాని ప్రకటిస్తే ఏపీలో టీడీపీ నుంచి ఫిరాయింపులు దాదాపు ఉండకపోవచ్చు.
కానీ ఒక సమూహంగా 10 మంది, 15 మంది ఫిరాయించి తమను ఒక గ్రూపుగా గుర్తించాలంటూ వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. అది చట్ట ప్రకారం సమంజసమే. కానీ అది అనైతిక చర్యే అవుతుంది. అందుకు స్పీకర్ సమ్మతిస్తారా… జగన్ మద్దతు ఇస్తారా అన్నది ప్రశ్నే.
కొన్ని విషయాలలో మొండిగా ఉండే జగన్ … బీజేపీ పెద్దలకు భయపడకుండా ఫిరాయింపుదారులపై వేటు వేయిస్తే… ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తే పరువు పోయేది బీజేపీదే. కాబట్టి టీడీపీ నుంచి ఫిరాయింపులు జరగకుండా జగనే చంద్రబాబుకు దేవుడిలా అడ్డుగా నిలబడ్డారనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు టీడీపీపై బీజేపీ చేస్తున్న విషప్రయోగాన్ని చూసి వైసీపీ వాళ్లు ఆనందపడడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక్క సారి బీజేపీకి పట్టు చిక్కితే రాష్ట్రంలో రాజకీయ ప్రశాంతత ఎవరికీ ఉండదు.