'మల్లేశం' సినిమా రివ్యూ
రివ్యూ: మల్లేశం రేటింగ్: 3/5 తారాగణం: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, ఆనంద చక్రపాణి, ఏలే లక్ష్మణ్ తదితరులు సంగీతం: మార్క్ కె రాబిన్ నిర్మాత: శ్రీ అధికార్ దర్శకత్వం: రాజ్ రాచకొండ ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ఇప్పుడు హీరోగా ‘మల్లేశం’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆసు యంత్రం కనిపెట్టిన మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీ అధికార్ నిర్మించిన ఈ సినిమా ని సురేష్ […]
రివ్యూ: మల్లేశం
రేటింగ్: 3/5
తారాగణం: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, ఆనంద చక్రపాణి, ఏలే లక్ష్మణ్ తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: శ్రీ అధికార్
దర్శకత్వం: రాజ్ రాచకొండ
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ఇప్పుడు హీరోగా ‘మల్లేశం’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆసు యంత్రం కనిపెట్టిన మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీ అధికార్ నిర్మించిన ఈ సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ పై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. అనన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.
చింతకింది మల్లేశం అనే ఒక సాధారణ యువకుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తన తల్లి బాధను చూడలేక ఆసుయంత్రం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేశాడు మల్లేశం. అంతగా ఆరాటపడ్డ ఒక చేనేత యువకుడు మల్లేశం (ప్రియాదర్షి) విజయం సాధించాడా? ఎలా? దానికోసం ఎంత కష్టపడ్డాడు? అనేది ఈ సినిమా కథ.
మల్లేశం పాత్రలో నటుడు ప్రియదర్శి ఒదిగిపోయి నటించాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా కమెడియన్ గా మాత్రమే తన నటన చూపించిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా కూడా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రియదర్శి అద్భుతమైన నటనతో ఈ సినిమాను తన భుజాలమీద మోశాడు అని చెప్పవచ్చు.
ఇక ప్రియదర్శి భార్య పాత్రలో కనిపించిన అనన్య కూడా చాలా చక్కగా నటించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రియదర్శి తల్లిపాత్రలో ఝాన్సీ ఎప్పటిలాగానే చాలా బాగా నటించింది. తన పాత్రకు ప్రాణం పోసింది. ప్రియదర్శి తండ్రి పాత్రలో ఆనంద చక్రపాణి కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. అంతేకాకుండా ఆయన ఈ సినిమాలో మంచి నటనను కూడా కనపరిచారు. ఏలే లక్ష్మణ్ కూడా మిగతా నటులతో పోటీపడుతూ నటించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
కథ ప్రకారం ఈ సినిమాలో బోలెడు అంశాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ టచ్ చేస్తూ దర్శకుడు కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. జీవిత చరిత్ర అయినప్పటికీ ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ఒక చేనేత కార్మికుడి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఆయన రాసిన పాటలు మాత్రమే కాకుండా ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో కెమెరా పనితనం గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. వాతావరణం మరియు ఆ పరిసరాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగారు సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ కూడా పరవాలేదనిపించింది.
- బలాలు:
కథ,
నటీనటులు,
సంగీతం
- బలహీనతలు
కొన్ని స్లో సన్నివేశాలు
జీవిత చరిత్ర కాబట్టి సినిమా కథ ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఒక చేనేత కార్మికుడి ఆత్మహత్యతో సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలతో హాస్యం…. అవన్నీ బాగున్నాయి. మధ్య మధ్యలో చేనేత కుటుంబాల బాధలను, కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఒక సాధారణ చేనేత కుటుంబం అంటే ఇలానే ఉంటుంది అని సినిమా చూస్తే అర్ధమవుతుంది. పల్లెటూళ్ళలో మిగతా కుటుంబాలతో సంబంధాలు ఎలా ఉంటాయి అని కూడా దర్శకుడు బాగా చూపించారు.
మొదటి నుండి చివరివరకూ కథ ఆసక్తికరంగా మరియు ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. చివరగా చెప్పాలంటే ‘మల్లేశం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంది.