ప్రత్యేక బృందంగా గుర్తించండి.....
టీడీపీలో సంక్షోభం ముదురుతోంది. చంద్రబాబు ఆర్థిక శక్తులుగా భావించే రాజ్యసభ ఎంపీలు టీడీపీని వీడేందుకు రంగం సిద్దమైంది. వారితో పాటు మరికొందరు అదే దారిలో పయనిస్తున్నారు. రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, సీతారామలక్ష్మి, గరికపాటి ఈ ఐదుగురు టీడీపీని వీడి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వీరు ఐదుగురు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి తమను ప్రత్యేక బృందంగా గుర్తించాల్సిందిగా లేఖ ఇవ్వబోతున్నారు. నేడో రేపో ఇందుకు సంబంధించి అధికారిక […]
టీడీపీలో సంక్షోభం ముదురుతోంది. చంద్రబాబు ఆర్థిక శక్తులుగా భావించే రాజ్యసభ ఎంపీలు టీడీపీని వీడేందుకు రంగం సిద్దమైంది. వారితో పాటు మరికొందరు అదే దారిలో పయనిస్తున్నారు. రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, సీతారామలక్ష్మి, గరికపాటి ఈ ఐదుగురు టీడీపీని వీడి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరు ఐదుగురు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి తమను ప్రత్యేక బృందంగా గుర్తించాల్సిందిగా లేఖ ఇవ్వబోతున్నారు. నేడో రేపో ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చే చాన్స్ ఉంది.
రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు టీడీపీకి ఉండగా… ఒక్క కనకమేడల మాత్రమే టీడీపీలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా, సీఎం రమేష్, గరికపాటిలు కూడా టీడీపీని వీడేందుకు సిద్దమవడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.