రాజకీయాలకు దూరం అవుతున్న సుష్మ.... సుమిత్ర
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మ స్వరాజ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారా. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఈ ఇద్దరు నాయకురాళ్లు పోటీ చేయలేదు. వీరిలో అనారోగ్య కారణాలతో సుష్మ స్వరాజ్ పోటీ చేయలేదు. ఇక వయస్సును సాకుగా చూపిస్తూ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు బిజేపీ అధిష్టానం టిక్కెట్టు నిరాకరించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతారని […]
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మ స్వరాజ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారా.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఈ ఇద్దరు నాయకురాళ్లు పోటీ చేయలేదు. వీరిలో అనారోగ్య కారణాలతో సుష్మ స్వరాజ్ పోటీ చేయలేదు. ఇక వయస్సును సాకుగా చూపిస్తూ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు బిజేపీ అధిష్టానం టిక్కెట్టు నిరాకరించింది.
ఆ సమయంలోనే వీరిద్దరూ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తు సుష్మ స్వరాజ్, సుమిత్ర మహాజన్ లు లోక్ సభ మాజీ సభ్యులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ లోక్ సభ అధికారులను కోరుతు లేఖ రాసారు.
ఈ లేఖకు స్పందించిన అధికారులు సుమిత్ర మహాజన్ కు లోక్ సభ మాజీ సభ్యురాలుగా కార్డును మంజూరు చేసారు. ఒకటి రెండు రోజులలో కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కు కూడా కార్డును మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ కార్డు తీసుకుంటే వారిద్దరూ భారత రాజకీయాలనుంచి పూర్తిగా వైదొలగినట్లుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఇక ముందు ప్రత్యక్ష రాజకీయలలో కనిపించే అవకాశాలు లేనట్లే అని చెబుతున్నారు. వీరిద్దరిని గవర్నలుగా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలను సుష్మ స్వరాజ్ ఖండించారు. తాను ఇంటికే పరిమితం అవుతానని, ఎలాంటి పదవులు తీసుకోనని ప్రకటించారు.
ఇక మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు వయోభారం కారణంగా గవర్నర్ పదవి కూడా దక్కె అవకాశాలు లేవు. కొన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించిన ఈ మహిళా నేతలు రాజకీయాల నుంచి కనుమరుగు కానున్నారు.