15 ఏళ్ళ క్రితమూ ఇదే యాగీ

నోళ్ళు పెట్టుకు బ్రతకడంలో టీడీపీ నాయకులకు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు చాలరన్నట్టు వాళ్ళను మించి యాగీ చేయడంలో ఎల్లోమీడియా ముందుంటోంది. చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రత తనికీ చేశారని, ఆయన కాన్వాయ్‌ని నేరుగా రన్‌వే మీదకు పంపలేదని దేశం నాయకులు నిన్నటినుంచి గొడవగొడవ చేస్తుంటే…. ఎల్లో మీడియా దాన్ని మించి లబోదిబోమంటోంది. మామూలు కార్యకర్తలకు తెలియకపోతే పోయింది… మీడియా వాళ్ళకు తెలియదా? ఎయిర్‌పోర్టుల్లో నిబంధనలు ఎలా ఉంటాయో..! ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో వాళ్ళకు […]

Advertisement
Update:2019-06-16 05:30 IST

నోళ్ళు పెట్టుకు బ్రతకడంలో టీడీపీ నాయకులకు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు చాలరన్నట్టు వాళ్ళను మించి యాగీ చేయడంలో ఎల్లోమీడియా ముందుంటోంది.

చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రత తనికీ చేశారని, ఆయన కాన్వాయ్‌ని నేరుగా రన్‌వే మీదకు పంపలేదని దేశం నాయకులు నిన్నటినుంచి గొడవగొడవ చేస్తుంటే…. ఎల్లో మీడియా దాన్ని మించి లబోదిబోమంటోంది.

మామూలు కార్యకర్తలకు తెలియకపోతే పోయింది… మీడియా వాళ్ళకు తెలియదా? ఎయిర్‌పోర్టుల్లో నిబంధనలు ఎలా ఉంటాయో..!

ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో వాళ్ళకు అవగాహన లేదా?

తెలియక కాదు…. కావాలనే ఈ రచ్చ రచ్చంతా.

ఇదంతా చూస్తుంటే 15 ఏళ్ళ క్రితం చంద్రబాబు ఓడిపోయి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి. అప్పుడు కూడా సెక్యూరిటీ విషయంలో ఇదే రభస…. కొన్ని నెలల పాటు సాగింది. చంద్రబాబుకు రోప్‌ పార్టీ సెక్యూరిటీ ఉండాలని చాలా ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిగా దిగిపోయాక చంద్రబాబుకు ఇస్తున్న సెక్యూరిటీ పోలీసుల సంఖ్యను తగ్గించినప్పుడు కూడా టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ఎంత యాగీ చేశాయో చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రతిపక్షనాయకుడు అయ్యాక నిబంధనల ప్రకారం ఇలాంటి మార్పులు సహజమే కదా…! అని విలేకరులు ప్రశ్నిస్తే…. నన్నపనేని రాజకుమారి లాంటి వాళ్ళు…. చంద్రబాబు ఓడిపోవచ్చు గాక…. మా దృష్టిలో ఆయనే ముఖ్యమంత్రి. రాజశేఖర్‌ రెడ్డి ని ముఖ్యమంత్రిగా ఒప్పుకోం…. మాకు చంద్రబాబే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఆయనకు ఇచ్చిన సెక్యూరిటీని కొనసాగించాల్సిందే…. అంటూ ఆవేశపడింది. అప్పుడు ఆమెలా అవేశపడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు.

చంద్రబాబు ఓడిపోయి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆయనను ముఖ్యమంత్రిగా అంగీకరించలేమని కొందరు చాలాకాలం పాటు బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి.

కొంతమంది చంద్రబాబు ఓడిపోయినా….. ఆయనను తప్ప వేరేవాళ్ళను ముఖ్యమంత్రిగా అంగీకరించం అంటున్నారు…. వీడియోలు విడుదల చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి ఎవరని ఎవరైనా అడిగితే జగన్‌ పేరు చెప్పాలంటే అవమానంగా ఉందని, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా ముఖ్యమంత్రి పేరే చెప్పమని…. ఒకామె వీడియో రిలీజ్‌ చేసింది…. ఇలాంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా…. 50 శాతం పైగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయినా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే…. వీళ్ళు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఎద్దేవా చేస్తున్నట్లే.

వీళ్ళు ఏ బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నారో…. అది భరించలేకే జనం చంద్రబాబును ఇంటికి పంపించారు. 15 ఏళ్ళ క్రితం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని నమ్మడానికి కొందరు జనాలకు కొన్ని నెలలు పడితే…. కొన్ని పత్రికలకు కొన్నేళ్ళు పట్టింది…. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని నమ్మడానికి ఈసారి ఎంత టైం పడుతుందో….! అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఈ గోల తప్పేట్లు లేదు.

Tags:    
Advertisement

Similar News