తగ్గని జగన్.... బాబుకు షాక్.... కేంద్రంతో ఢీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు.. కేంద్రంతో ఢీ అంటున్నారు. కేంద్రం వద్దన్నా విచారణకే మొగ్గు చూపుతున్నారు. ఇది టీడీపీకి పెద్ద షాక్ లాగా తయారైంది. తాజాగా సీఎం జగన్… చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పున: సమీక్ష చేస్తామని…. అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. దీనిపై కేంద్రం నో చెప్పినా ఆయన ముందుకే వెళుతుండడం సంచలనంగా మారింది. తాజాగా జగన్ కేబినెట్ భేటిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వద్దని చెప్పినా […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు.. కేంద్రంతో ఢీ అంటున్నారు. కేంద్రం వద్దన్నా విచారణకే మొగ్గు చూపుతున్నారు. ఇది టీడీపీకి పెద్ద షాక్ లాగా తయారైంది.
తాజాగా సీఎం జగన్… చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పున: సమీక్ష చేస్తామని…. అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. దీనిపై కేంద్రం నో చెప్పినా ఆయన ముందుకే వెళుతుండడం సంచలనంగా మారింది.
తాజాగా జగన్ కేబినెట్ భేటిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వద్దని చెప్పినా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విద్యుత్ ఒప్పందాల కొనుగోలు (పీపీఏ)లపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
చంద్రబాబు చేసుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందాల్లో అవినీతిపై నిగ్గుతేల్చాలనే కమిటీ వేసినట్లు తెలుస్తోంది. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధరలకు చంద్రబాబు పీపీఏలు చేసుకోవడం వెనుక భారీ అవినీతి, కుట్ర ఉందని యోచిస్తున్నారు.
దీంతో చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే రద్దు చేసుకొని తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందాలకు జగన్ ముందడుగు వేస్తున్నారు.
అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే ఖరారైన విద్యుత్ కొనుగోళ్లపై సమీక్షిస్తే ఏపీ అభివృద్ధికి విఘాతం అని.. పెట్టుబడులు రావని అడ్డు చెప్పింది. ఈ నేపథ్యంలోనే జగన్ కేంద్రంతో ఢీకొనడం.. చంద్రబాబు టార్గెట్ గా ముందుకెళ్లడం విశేషంగా మారింది.