ఉద్యోగులెవరి మీదా కక్ష పెంచుకోం....

శనివారం ఉదయం జగన్‌ సచివాలయంలోని ఆయన కార్యాలయంలోకి ప్రవేశించిన తరువాత గ్రీవెన్స్‌హాల్‌లో సచివాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు వరాలు కురిపించడంతో పాటు వాటిని త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపటి మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దు పై నిర్ణయం తీసుకుంటామన్నారు వైఎస్‌ జగన్‌. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం కావాలని కోరారు ఆయన. ప్రభుత్వంలో ఉన్న […]

Advertisement
Update:2019-06-08 06:24 IST

శనివారం ఉదయం జగన్‌ సచివాలయంలోని ఆయన కార్యాలయంలోకి ప్రవేశించిన తరువాత గ్రీవెన్స్‌హాల్‌లో సచివాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు వరాలు కురిపించడంతో పాటు వాటిని త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రేపటి మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దు పై నిర్ణయం తీసుకుంటామన్నారు వైఎస్‌ జగన్‌. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం కావాలని కోరారు ఆయన.

ప్రభుత్వంలో ఉన్న నాయకులతో ఉద్యోగులు సన్నిహితంగా ఉండడం సర్వసాధారణం అని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికే సన్నిహితంగా ఉంటారని…. గత ప్రభుత్వంలో నాయకులతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను నేనెవరినీ తప్పుపట్టనని…. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అన్నారు సీఎం జగన్‌.

ఔట్‌సోర్పింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు‌. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News