ఏపీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖల కేటాయింపు చేశారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. వివరాలు…. 1. ధర్మాన కృష్ణదాస్ : రోడ్లు భవనాల శాఖ 2. బొత్స సత్యనారాయణ : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, 3. పాముల పుష్పశ్రీవాణి : ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం 4. అవంతి శ్రీనివాస్ : పర్యటక శాఖ, యూత్ అఫైర్స్ […]
శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖల కేటాయింపు చేశారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
వివరాలు….
1. ధర్మాన కృష్ణదాస్ : రోడ్లు భవనాల శాఖ
2. బొత్స సత్యనారాయణ : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ,
3. పాముల పుష్పశ్రీవాణి : ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం
4. అవంతి శ్రీనివాస్ : పర్యటక శాఖ, యూత్ అఫైర్స్
5. పిల్లి సుభాష్ చంద్రబోస్ : ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ
6. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ, సహకార శాఖ
7. పినిపె విశ్వరూప్ : సాంఘీక సంక్షేమం
8. ఆళ్ల నాని : ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ
9. తానేటి వనిత : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు : గృహ నిర్మాణం
11. వెల్లంపల్లి శ్రీనివాస్ : దేవాదాయ శాఖ
12. కొడాలి నాని : పౌరసరఫరా శాఖ
13. పేర్ని నాని : సమాచార శాఖ
14. మేకతోటి సుచరిత : హోం శాఖ, విపత్తు నిర్వహణ
15. మోపిదేవి వెంకటరమణారావు : మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖ
16.బాలినేని శ్రీనివాసరెడ్డి : విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
17. ఆదిమూలపు సురేష్ : విద్యాశాఖ
18.పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ : నీటిపారుదల శాఖ
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ
20. షేక్ బేపారి అంజాద్ బాషా : ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : పంచాయితీ రాజ్, గనుల శాఖ
22. కళత్తూరు నారాయణస్వామి : ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాల శాఖ
24. గుమ్మనూరు జయరామ్ : కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ
25. మాలగుండ్ల శంకరనారాయణ : బీసీ సంక్షేమం