టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీలో భారత్ శుభారంభం

రష్యాపై 10-0 గోల్స్ తో భారత్ విజయం భువనేశ్వర్ వేదికగా ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ ఒలింపిక్స్ హాకీ మాజీ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ గ్రూప్ ప్రారంభ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ వీరవిహారం చేసింది. రష్యాతో జరిగిన పోటీలో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. మొత్తం నాలుగు క్వార్టర్ల ఈ మ్యాచ్ ఆఖరి రెండు క్వార్టర్లలో […]

Advertisement
Update:2019-06-07 06:05 IST
  • రష్యాపై 10-0 గోల్స్ తో భారత్ విజయం
  • భువనేశ్వర్ వేదికగా ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్

ఒలింపిక్స్ హాకీ మాజీ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ అర్హత హాకీ టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ గ్రూప్ ప్రారంభ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ వీరవిహారం చేసింది.

రష్యాతో జరిగిన పోటీలో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. మొత్తం నాలుగు క్వార్టర్ల ఈ మ్యాచ్ ఆఖరి రెండు క్వార్టర్లలో గోల్ ల వర్షం కురిపించారు.

భారత డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆట 38, 42 నిముషాలలో పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ సాధించగా… ఆకాశ్ దీప్ సింగ్ ఆట 41, 55 నిముషాలలో రెండు గోల్స్ సాధించి టాప్ స్కోరర్లు గా నిలిచారు.

13వ నిముషంలో నీలకంఠ శర్మ, 19వ నిముషంలో సిమ్రన్ జీత్ సింగ్, 20వ నిముషంలో అమిత్ రోహిత్ దాస్, 32వ నిముషంలో వరుణ్ కుమార్, 38వ నిముషంలో గురుసబ్ జీత్ సింగ్, 45వ నిముషంలో వివేక్ సాగర్ తలో గోల్ చేయడంతో భారత్ 10-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.

పూల్-ఎ రెండోరౌండ్ పోటీలో పోలెండ్ తో భారత్ తలపడుతుంది.

ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్… మరిన్ని గోల్స్ చేసి ఉండాల్సిందని చీఫ్ కోచ్ గ్రాహం రీడ్…. మ్యాచ్ అనంతరం చెప్పారు.

ఎనిమిది దేశాల ఈ టోర్నీలో తలపడుతున్న ఇతర జట్లలో ఉజ్బెకిస్థాన్, అమెరికా, సౌతాఫ్రికా, జపాన్, మెక్సికో ఉన్నాయి. ఈ ఎనిమిదిజట్ల నుంచి.. రెండుజట్లకు మాత్రమే…ఒలింపిక్స్ అర్హత రౌండ్ కు చేరుకోగలుగుతాయి.

Tags:    
Advertisement

Similar News