ఇప్పుడు టీడీపీ నేతలకు నాని హాట్‌ టాపిక్‌

విజ‌య‌వాడ ఏ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో టీడీపీ పార్టీ త‌ర‌పున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, లోకేష్ పాల్గొన్నారు. కానీ ఈ విందుకు ఎంపీ కేశినేని నాని హాజ‌రుకాక‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింది. ఈ విందుకు డుమ్మా కొట్టేందుకే……అదే టైమ్‌లో ఢిల్లీకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి దేవినేని ఉమా త‌న‌ను ఓడించేందుకు చూశాడ‌ని నాని ఆరోప‌ణ‌. దేవినేని వ‌ర్గంతో చాలా కాలంగా నానికి ప‌డ‌టం లేదు. దీంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఇఫ్తార్ విందుకు కేశినేని […]

Advertisement
Update:2019-06-05 08:10 IST

విజ‌య‌వాడ ఏ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో టీడీపీ పార్టీ త‌ర‌పున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, లోకేష్ పాల్గొన్నారు. కానీ ఈ విందుకు ఎంపీ కేశినేని నాని హాజ‌రుకాక‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింది. ఈ విందుకు డుమ్మా కొట్టేందుకే……అదే టైమ్‌లో ఢిల్లీకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

మంత్రి దేవినేని ఉమా త‌న‌ను ఓడించేందుకు చూశాడ‌ని నాని ఆరోప‌ణ‌. దేవినేని వ‌ర్గంతో చాలా కాలంగా నానికి ప‌డ‌టం లేదు. దీంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఇఫ్తార్ విందుకు కేశినేని నాని కావాల‌నే డుమ్మా కొట్టార‌ని తెలుస్తోంది. ఈ విందుకు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు నాని వ‌ర్గం నేత‌లు హాజ‌రుకాలేదు. దీంతో బెజ‌వాడ టీడీపీలో వ‌ర్గ విభేదాలు ఎటు దారితీస్తాయో చూడాలి.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హారం టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి బీజేపీ నేత‌ల‌తో నాని వ‌రుస‌గా భేటీ అవుతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీని ఆయ‌న క‌లిశారు. గ‌డ్క‌రీతో ఉన్న అనుబంధం గురించి ట్వీట్ చేశారు. ఆయ‌న స‌హ‌కారంతో ప‌లు ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకుపోయినట్లు చెప్పారు.

బీజేపీ మంత్రుల్లో దాదాపు 25 మందితో నానికి మంచి స్నేహం ఉంది. గ‌డ్క‌రీ బాగా క్లోజ్‌. విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా గడ్కరీని నాని రిసీవ్ చేసుకునేవారు.

విజ‌య‌వాడ ఎంపీగా ఎన్నికైన త‌ర్వాత నుంచి నాని బీజేపీ నేత‌ల‌తో మంచి సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఢిల్లీలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం లేక‌పోవ‌డంతో బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతార‌ని బెజవాడ త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. నాని సంగతేంటి? అని చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News