ప్రపంచకప్ లో పాక్ తొలి సంచలనం

టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ కు పాక్ షాక్  హైస్కోరింగ్ చేజింగ్ లో ఇంగ్లండ్ బోల్తా వన్డే ప్రపంచకప్ ఆరవరౌండ్ మ్యాచ్ లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్ కు పాకిస్థాన్ 14 పరుగులతో షాకిచ్చింది. పాక్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హైస్కోరింగ్ ఫైట్…. నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన ఈ హైస్కోరింగ్ సమరంలో టాస్ ఓడి […]

Advertisement
Update:2019-06-04 10:30 IST
  • టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ కు పాక్ షాక్
  • హైస్కోరింగ్ చేజింగ్ లో ఇంగ్లండ్ బోల్తా

వన్డే ప్రపంచకప్ ఆరవరౌండ్ మ్యాచ్ లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్ కు పాకిస్థాన్ 14 పరుగులతో షాకిచ్చింది. పాక్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

హైస్కోరింగ్ ఫైట్….

నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన ఈ హైస్కోరింగ్ సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు…50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్ ఇమాముల్ 44, బాబర్ అజామ్ 63, మహ్మద్ హఫీజ్ 84, కెప్టెన్ సర్ ఫ్రాజ్ అహ్మద్ 55 పరుగుల స్కోర్లు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, మోయిన్ అలీ చెరో మూడు వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

పోరాడి ఓడిన ఇంగ్లండ్…

349 పరుగుల ప్రపంచ కప్ రికార్డు స్కోరు లక్ష్యంగా చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ చివరకు 50 ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.

వన్ డౌన్ జో రూట్ 107,మిడిలార్డర్ ఆటగాడు బట్లర్ 103 పరుగులతో సెంచరీలు బాదినా ఇంగ్లండ్ కు 14 పరుగుల పరాజయం తప్పలేదు.

12 పరాజయాల తర్వాత…

ప్రపంచకప్ కు ముందు ఆడిన వన్డే ల్లో వరుసగా 12 పరాజయాలు చవిచూసిన పాకిస్థాన్ ఎట్టకేలకు తొలివిజయం నమోదు చేయగలిగింది.

ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా పాక్ జట్టు 5-4 రికార్డుతో పైచేయి సాధించగలిగింది.

ప్రపంచకప్ తొలిరౌండ్ పోటీలో విండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ జట్టు రెండోరౌండ్ పోటీలో పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను కంగు తినిపించడం ద్వారా.. పుంజుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News