సైబర్ క్రైం పోలీసుల ముందు హాజరైన రవిప్రకాశ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇవాళ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఆయన పోలీసుల ముందుకు రాక తప్పలేదు. టీవీ9 సంస్థకు సంబంధించి నకీలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు, అక్రమంగా నిధుల బదిలీ వ్యవహారాల విషయంలో ఆయనపై కొత్త యాజమాన్యం అయిన అలంద మీడియా ఆయనపై పిర్యాదు చేసింది. గత నెల […]

Advertisement
Update:2019-06-04 12:23 IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇవాళ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఆయన పోలీసుల ముందుకు రాక తప్పలేదు.

టీవీ9 సంస్థకు సంబంధించి నకీలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు, అక్రమంగా నిధుల బదిలీ వ్యవహారాల విషయంలో ఆయనపై కొత్త యాజమాన్యం అయిన అలంద మీడియా ఆయనపై పిర్యాదు చేసింది. గత నెల 10న టీవీ9లో రెండు నిమిషాల పాటు లైవ్ బులిటెన్ లో కనిపించిన ఆయన…. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలు దఫాలుగా నోటీసులు జారీచేశారు. ఏ ఒక్కదానికీ స్పందించకపోవడంతో 41ఏ సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు.

ఇదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రవి ప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని.. ఈ విషయాన్ని హైకోర్టే తేల్చాల్సి ఉందని చెప్పింది. అదే సమయంలో పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

దీంతో ఆయన ఇవాళ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. రవిప్రకాష్‌ను ఒక వేళ అరెస్టు చేయాలంటే 48 గంటల ముందుగా పోలీసులు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇవాళ ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు.

ప్రస్తుతం రవిప్రకాశ్‌ను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఆయనను అరెస్టు చేయదలుచుకుంటే పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News