ఇక ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళలకోసం ఒక సంచలన పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ స్కూల్‌ భవనాలను ఆధునీకరించడంతో పాటు…. ప్రైవేట్‌ స్కూళ్ళ, కాలేజీల ఫీజులను నియంత్రించడంలో సక్సెస్‌ అయింది ఆప్‌ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య సేవలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి సామాన్యులకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వివిధ వైద్య పరీక్షల రిపోర్టులను ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కడనుంచైనా పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతేకాక ప్రభుత్వ సర్టిఫికేట్‌లను, ఇతర […]

Advertisement
Update:2019-06-03 09:40 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళలకోసం ఒక సంచలన పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ స్కూల్‌ భవనాలను ఆధునీకరించడంతో పాటు…. ప్రైవేట్‌ స్కూళ్ళ, కాలేజీల ఫీజులను నియంత్రించడంలో సక్సెస్‌ అయింది ఆప్‌ ప్రభుత్వం.

అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య సేవలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి సామాన్యులకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వివిధ వైద్య పరీక్షల రిపోర్టులను ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కడనుంచైనా పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసింది.

అంతేకాక ప్రభుత్వ సర్టిఫికేట్‌లను, ఇతర సేవలను తమ ఇంటివద్దే పొందే విధంగా డోర్‌డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా కరెంట్‌ సరఫరా చేసే ప్రైవేట్‌ సంస్థల ఆగడాలను అదుపుచేయడంతోపాటు…. ముందస్తు సమాచారం లేకుండా కరెంట్‌ సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఆ సంస్థలు ఫైన్‌ కట్టే విధానాన్ని తీసుకొచ్చింది కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం.

అయితే కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత సేవలను అందించబోతోంది.

మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. మహిళల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు ఆయన. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News