నెటిజన్లకు క్షమాపణలు చేప్పిన సాయిపల్లవి

సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండని హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు. ఎప్పుడో తప్ప సోషల్ మీడియా లో మెరవని ఈ భామ…. మాట తప్పడంతో నెటిజన్ లు ఈమెపై బాగా ఫైర్ అవుతున్నారు. అసలు కథలోకి వెళితే తాజాగా సాయి పల్లవి తన తదుపరి సినిమా అయిన ‘ఎన్ జీ కే’ ప్రోమోషన్ల నేపథ్యంలో సోషల్ మీడియా #ఆస్క్ సాయి పల్లవి అంటూ తనని ప్రశ్నలు అడగమని పోస్ట్ చేసింది. “మీతో మాట్లాడి చాలా […]

;

Advertisement
Update:2019-06-01 02:51 IST
నెటిజన్లకు క్షమాపణలు చేప్పిన సాయిపల్లవి
  • whatsapp icon

సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండని హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు. ఎప్పుడో తప్ప సోషల్ మీడియా లో మెరవని ఈ భామ…. మాట తప్పడంతో నెటిజన్ లు ఈమెపై బాగా ఫైర్ అవుతున్నారు.

అసలు కథలోకి వెళితే తాజాగా సాయి పల్లవి తన తదుపరి సినిమా అయిన ‘ఎన్ జీ కే’ ప్రోమోషన్ల నేపథ్యంలో సోషల్ మీడియా #ఆస్క్ సాయి పల్లవి అంటూ తనని ప్రశ్నలు అడగమని పోస్ట్ చేసింది. “మీతో మాట్లాడి చాలా రోజులైంది. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఏమైనా అడగండి.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సాయిపల్లవి.
దీంతో వేలల్లో అభిమానులు ట్వీట్లు చేశారు.

కానీ ఇలా ప్రకటించినట్టే ప్రకటించి అలా సైడ్ అయిపోయింది సాయిపల్లవి. 6-7 ప్రశ్నలకు మాత్రమే చిన్నగా సమాధానం చెప్పి ఆపేసింది సాయిపల్లవి. దీంతో నెటిజన్లకు కోపం వచ్చి…. మాట్లాడుకుందాం అని చెప్పి మోసం చేసింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో సాయిపల్లవి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.

“చాలామంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి” అంటూ పోస్ట్ చేసింది.

Tags:    
Advertisement

Similar News