డేరింగ్ డెసిషన్ తీసుకున్న బన్నీ

అల్లు అర్జున్ ఎప్పుడైనా రెండు సినిమాలు చేయడం చూశారా? ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా సెట్స్ పైకి వచ్చి, సమాంతరంగా 2 సినిమాలు పూర్తిచేయడం చూశారా? ఇకపై అలాంటి అద్భుతాన్ని చూడబోతున్నారు. అవును.. ఒకేసారి రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు బన్నీ. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. 4వ తేదీ నుంచి మరో భారీ […]

Advertisement
Update:2019-05-30 06:25 IST

అల్లు అర్జున్ ఎప్పుడైనా రెండు సినిమాలు చేయడం చూశారా? ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా సెట్స్ పైకి వచ్చి, సమాంతరంగా 2 సినిమాలు పూర్తిచేయడం చూశారా? ఇకపై అలాంటి అద్భుతాన్ని చూడబోతున్నారు. అవును.. ఒకేసారి రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు బన్నీ.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు బన్నీ. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. 4వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అల్లు అర్జున్.

దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాలో నటించేందుకు బన్నీ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం త్రివిక్రమ్ సినిమాతో పాటు ఈ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు.

నా పేరు సూర్య వల్ల ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు బన్నీ ఇలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి, వేణు శ్రీరామ్ తీయబోయే ఐకాన్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలనేది ప్లాన్.

Tags:    
Advertisement

Similar News