వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరం

ఏపీ రాష్ట్ర కొత్త సీఎంగా వైసీపీ అధినేత జగన్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయ నేతల నుంచి జాతీయ నేతలందరికీ ఆహ్వానాలు అందాయి. కొందరిని జగన్ స్వయంగా వెళ్లి ఆహ్వానించగా… మరి కొందరిని ఫోన్ల ద్వారా జగన్ ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉండవల్లిలో జరిగిన టీడీఎల్పీ […]

Advertisement
Update:2019-05-29 08:01 IST

ఏపీ రాష్ట్ర కొత్త సీఎంగా వైసీపీ అధినేత జగన్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయ నేతల నుంచి జాతీయ నేతలందరికీ ఆహ్వానాలు అందాయి. కొందరిని జగన్ స్వయంగా వెళ్లి ఆహ్వానించగా… మరి కొందరిని ఫోన్ల ద్వారా జగన్ ఆహ్వానించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును కూడా జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉండవల్లిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు ఇంటికి వచ్చి జగన్ ఆహ్వానించక పోవడాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుబట్టాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించిన జగన్.. చంద్రబాబు వద్దకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించాడు. ఈ కారణంగానే జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడంలేదని చెప్పాడు ఆయన.

అయితే టీడీపీ…. పార్టీ తరపున ఇద్దరు సీనియర్ల ద్వారా శుభాకాంక్షల లేఖను జగన్ ఇంటికి వెళ్లి ఇచ్చి రావాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి …. జగన్‌కు కనీసం ఫోన్ చేసి కూడా పిలవలేదు. జీఏడీ కార్యదర్శి ద్వారా ఒక ఆహ్వాన పత్రికను పంపారు. కానీ ఇప్పుడు జగన్ స్వయంగా పిలిచినా చంద్రబాబు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News