ఫ్రెంచ్ ఓపెన్ లో సీడెడ్ స్టార్ల బోణీ
తొలిరౌండ్ గండం గడచిన సెరెనా గ్రాండ్ స్లామ్ లో సెరెనా 800వ మ్యాచ్ గెలుపు నడాల్, జోకో అలవోక విజయాలు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండోరౌండ్ కు సీడెడ్ స్టార్లు, హాట్ ఫేవరెట్లు రాఫెల్ నడాల్, నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ చేరుకొన్నారు. సరికొత్తగా నిర్మించిన రోలాండ్ గారోస్ స్టేడియం కాంప్లెక్స్ లో…సరికొత్త డిజైనర్ డ్రెస్ తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్ వన్ ,10వ సీడ్ సెరెనా విలియమ్స్ తొలిరౌండ్ గండం గడచి […]
- తొలిరౌండ్ గండం గడచిన సెరెనా
- గ్రాండ్ స్లామ్ లో సెరెనా 800వ మ్యాచ్ గెలుపు
- నడాల్, జోకో అలవోక విజయాలు
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండోరౌండ్ కు సీడెడ్ స్టార్లు, హాట్ ఫేవరెట్లు రాఫెల్ నడాల్, నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ చేరుకొన్నారు.
సరికొత్తగా నిర్మించిన రోలాండ్ గారోస్ స్టేడియం కాంప్లెక్స్ లో…సరికొత్త డిజైనర్ డ్రెస్ తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్ వన్
,10వ సీడ్ సెరెనా విలియమ్స్ తొలిరౌండ్ గండం గడచి రెండోరౌండ్ కు అర్హత సంపాదించింది.
800 విజయాల సెరెనా..
గత ఏడాది ఓపాపకు జన్మనిచ్చిన సెరెనా…ఆ తర్వాత నుంచి ఫామ్ లో రావడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తూ వస్తోంది. 37 ఏళ్ల వయసులో 24వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కు గురిపెట్టింది. మార్గారెట్ కోర్ట్ పేరుతో ఉన్న 24 టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.
ప్రస్తుత ఈ టోర్నీలో 10వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన సెరెనా…తొలిరౌండ్లో…తొలిసెట్ ను 2-6తో కోల్పోయినా…ఆ తర్వాతి రెండుసెట్లను అలవోకగా నెగ్గి…రెండోరౌండ్లో అడుగు పెట్టింది. సెరెనా కెరియర్ లో ఇది.. మెయిన్ డ్రాలో సాధించిన 800వ విజయంగా రికార్డుల్లో చేరింది.
గతంలో 2002, 2013, 2015 సీజన్లలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా…ఇప్పుడు నాలుగోసారి విజేతగా నిలవడం ద్వారా.. అరుదైన రికార్డు అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.
రెండో రౌండ్లో స్పానిష్ బుల్
పురుషుల సింగిల్స్ లో 12వసారి చాంపియన్ గా నిలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన స్పానిష్ బుల్, రెండో సీడ్ రాఫెల్ నడాల్.. తొలిరౌండ్లో అలవోక విజయం సాధించాడు.
జర్మన్ ఆటగాడు యానిక్ హాఫ్ మాన్ ను డిఫెండింగ్ చాంపియన్ నడాల్ వరుస సెట్లలో…6-2, 6-1, 6-3తో చిత్తు చేశాడు. తన కెరియర్ లో 100వ క్లే కోర్టు టెన్నిస్ టోర్నీలో పాల్గొంటున్న నడాల్…429 విజయాలు, 39 పరాజయాల రికార్డుతో ఉన్నాడు. అంతేకాదు నడాల్ సాధించిన మొత్తం టైటిల్స్ లో.. క్లే కోర్టులో నెగ్గినవే 58 వరకూ ఉన్నాయి.
జోకోవిచ్ తొలిగెలుపు..
మరోవైపు…ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ సైతం ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో తొలి విజయం నమోదు చేశాడు.
తొలిరౌండ్లో పోలిష్ ఆటగాడు హ్యూబర్ట్ ను 6-4, 6-2, 6-2తో ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
ప్రస్తుత సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ … ఫ్రెంచ్ ఓపెన్ సైతం నెగ్గడం ద్వారా… తన కెరియర్ లో.. రెండోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.