ఏపీ కేడ‌ర్‌కు మరో అధికారి !

ఏపీలో ప్ర‌భుత్వం మార‌డంతో అక్క‌డ ప‌నిచేసేందుకు అధికారులు క్యూ క‌డుతున్నారు. స‌మ‌ర్ధ‌వంత‌మైన అధికారుల‌కు జ‌గ‌న్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారు ఇప్పుడు అక్క‌డ ప‌నిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్ప‌టికే డీజీపీగా గౌతం స‌వాంగ్ పేరు దాదాపు ఖ‌రారైంది. నిఘా విభాగం అధికారిగా స్టీఫెన్ ర‌వీంద్ర‌, లా అండ్ ఆర్డ‌ర్ ఐజిగా పీఎస్ఆర్ అంజ‌నేయులు పేర్లకు జ‌గ‌న్ ఒకే చెప్పిన‌ట్లు తెలిసింది. విజ‌య‌వాడ‌, విశాఖ క‌మిష‌న‌ర్ల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. మ‌రోవైపు ఐఏఎస్ అధికారులు కూడా ఏపీ […]

Advertisement
Update:2019-05-28 04:03 IST

ఏపీలో ప్ర‌భుత్వం మార‌డంతో అక్క‌డ ప‌నిచేసేందుకు అధికారులు క్యూ క‌డుతున్నారు. స‌మ‌ర్ధ‌వంత‌మైన అధికారుల‌కు జ‌గ‌న్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారు ఇప్పుడు అక్క‌డ ప‌నిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ఇప్ప‌టికే డీజీపీగా గౌతం స‌వాంగ్ పేరు దాదాపు ఖ‌రారైంది. నిఘా విభాగం అధికారిగా స్టీఫెన్ ర‌వీంద్ర‌, లా అండ్ ఆర్డ‌ర్ ఐజిగా పీఎస్ఆర్ అంజ‌నేయులు పేర్లకు జ‌గ‌న్ ఒకే చెప్పిన‌ట్లు తెలిసింది. విజ‌య‌వాడ‌, విశాఖ క‌మిష‌న‌ర్ల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.

మ‌రోవైపు ఐఏఎస్ అధికారులు కూడా ఏపీ వైపు చూస్తున్నారు. ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యకార్యదర్శిగా శ్రీలక్ష్మి బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్‌కు శ్రీలక్ష్మిని కేటాయించారు.

జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈవిష‌యంలో జగన్‌, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర డిప్యుటేషన్‌ ఖాయమైనట్లు సమాచారం. ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు మరికొంతమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్ర‌బాబు హాయంలో ఉన్న అధికారులు డిప్యూటేష‌న్‌పై కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లారు. మ‌రికొంత మంది హైద‌రాబాద్‌లోనే ఉండిపోయారు. కానీ జ‌గ‌న్ రాగానే ఇన్నాళ్లు లూప్‌లైన్‌కు పరిమిత‌మైన అధికారులు.. ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వ‌స్తున్నారు. స‌మ‌ర్ధ‌వంత‌గా ప‌నిచేసే ఈ అధికారుల‌ను జ‌గ‌న్ వినియోగించుకుంటే మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చు అని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News