ఫోన్ స్విచ్చాఫ్ చేసి.... అజ్ఞాతంలోకి రాహుల్
ఒక్క ఓటమి.. ఒక్క గెలుపు.. కేంద్రంలో ఎంత మార్పు తెచ్చింది. బీజేపీ పెద్దాయన మోడీని దేశంలోనే అత్యంత శక్తివంతుడిగా మార్చగా.. తన హయాంలో దారుణ ఓటమితో రాహుల్ రాజీనామా వరకు పరిస్థితి వెళ్లింది. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా…. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాత్రం దాన్ని ఆమోదించలేదు. గెలుపు ఓటములు సహజమని.. రాజీనామాను తిరస్కరించిన సంగతి తెలిసిందే…. అయితే రాహుల్ మాత్రం తన సారథ్యంలో ఈ దారుణ ఓటమిని తట్టుకోవడం లేదు. తన రాజీనామా […]
ఒక్క ఓటమి.. ఒక్క గెలుపు.. కేంద్రంలో ఎంత మార్పు తెచ్చింది. బీజేపీ పెద్దాయన మోడీని దేశంలోనే అత్యంత శక్తివంతుడిగా మార్చగా.. తన హయాంలో దారుణ ఓటమితో రాహుల్ రాజీనామా వరకు పరిస్థితి వెళ్లింది.
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా…. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాత్రం దాన్ని ఆమోదించలేదు. గెలుపు ఓటములు సహజమని.. రాజీనామాను తిరస్కరించిన సంగతి తెలిసిందే….
అయితే రాహుల్ మాత్రం తన సారథ్యంలో ఈ దారుణ ఓటమిని తట్టుకోవడం లేదు. తన రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.
ఆదివారం కాంగ్రెస్ నేతలు పిలిచినా వెళ్లలేదు. ఫోన్ స్విచ్చాస్ చేసి అందరికీ దూరంగా వెళ్లిపోయారు.
కాంగ్రెస్ ఓటమికి సీనియర్లే కారణమని రాహుల్ మొన్న రాజీనామా చేశాక కాంగ్రెస్ సమావేశంలో విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు, కేంద్ర మాజీమంత్రి చిదంబరంలు తమ కుమారుల గెలుపు కోసం కృషి చేశారని…. పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. వీళ్లు కుమారుల గెలుపుకోసం వారాల పాటు వారితోనే ఉండి పార్టీ గెలుపు బాధ్యతలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
మోడీ అవినీతిపై కాంగ్రెస్ సీనియర్లు విమర్శలు చేయలేదని సీరియస్ అయ్యారు.
అప్పటి నుంచి అలిగి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలకు అందుబాటులోకి రాలేదట.. తన రాజీనామాను ఆమోదించేవరకు అందుబాటులో ఉండనని…. రాహుల్ స్పష్టం చేసి ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు.