'సీత' సినిమా రివ్యూ

రివ్యూ: సీత రేటింగ్‌: 2/5 తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, కాజట్, తనికెళ్ళ భరణి, సోను సూద్,  మన్నారా చోప్రా తదితరులు సంగీతం:  అనూప్ రూబెన్స్ నిర్మాత:  పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, తేజ దర్శకత్వం:  తేజ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ‘సీత’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కవచం’ సినిమాలో బెల్లంకొండ తో రొమాన్స్ చేసిన కాజల్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏకే […]

Advertisement
Update:2019-05-24 10:06 IST

రివ్యూ: సీత
రేటింగ్‌: 2/5
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, కాజట్, తనికెళ్ళ భరణి, సోను సూద్, మన్నారా చోప్రా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, తేజ
దర్శకత్వం: తేజ

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ‘సీత’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కవచం’ సినిమాలో బెల్లంకొండ తో రొమాన్స్ చేసిన కాజల్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే టీజర్ మరియు ట్రైలర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇవాళ (మే 24) విడుదలైంది.

సీత (కాజల్) ఒక పెద్ద కంస్ట్రక్షన్ కంపెనీ నడుపుతూ ఉంటుంది. ఒకానొక దశ లో తనకి సిటీ లో ఉన్న స్లం ఏరియా లో ని ఇల్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం లోకల్ ఎమ్మెల్యే బసవరాజ్ (సోను సూద్) సహాయం తీసుకుంటుంది. అందుకు గానూ అతడితో నెల రోజులు లివింగ్ టు గెదర్ చేస్తాను అని మాట ఇస్తుంది.

బసవరాజ్ పని పూర్తి చేశాక కాజల్ అతడిని మోసం చేస్తుంది. దీనిని సహించని బసవరాజ్ కాజల్ కి సమస్యలని తీసుకొని వస్తాడు. అసలు ఈ కథ కి రామ్ (బెల్లంకొండ) కి ఏంటి సంబంధం? కాజల్ బసవరాజ్ ప్లాన్స్ ని ఎలా అధిగమించింది? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ.

ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రతి సినిమాలోను ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్ ల మీద బాగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది.

ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ నటన పెద్ద ప్లస్ పాయింట్ గా పరిగణించవచ్చు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కాజల్ ఈసారి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. సోను సూద్ తన పాత్రకు జీవం పోశారు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా లో కనిపిస్తున్న సోనుసూద్ తన విలన్ పాత్ర తో బాగానే మెప్పించాడు.

మన్నారా చోప్రా మంచి నటనను కనబరిచింది. ఎప్పటిలాగానే తనికెళ్ళ భరణి తన పాత్రకు న్యాయం చేశారు. అభినవ్ గోమాటం ఈ సినిమాలో మంచి పాత్ర పోషించడమే కాక ప్రేక్షకులను మెప్పించాడు కూడా. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బెల్లంకొండ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకు నిర్మాతలు కావాల్సినంత బడ్జెట్ సమకూర్చారని తెలుస్తోంది. కానీ కథ ని సమకూర్చే విషయం లో నే పెద్దగా ఫెయిల్ అయ్యారు.

అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. పాటల సంగతి పక్కన పెడితే అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం కొంత వరకు కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శీర్షా రే అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

దర్శకుడు తేజ ఈ సినిమా కోసం ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేశారు అని అనిపించినా, చివరికి అది రొటీన్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా మిగతా వాటితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది అని అంతా భావించినా ఆసక్తికరం గా మలచడంలో తేజ మరోసారి విఫలమయ్యాడు అని చెప్పచ్చు.

దర్శకుడు తేజ తన సాగదీసిన నెరేషన్ తో బాగా బోర్ కొట్టించాడు. ఆసక్తికరంగా మొదలైన ఈ సినిమా మొదటి భాగం మొత్తం కామెడీ మరియు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లతోనే గడుస్తుంది.

అంత బలమైన కథ కాకపోయినప్పటికీ దర్శకుడు తేజ నెరేషన్ లో ఏమైనా మెరుపులు సృష్టిస్తాడు అనుకుంటే ఓవర్ ఎమోషన్స్ తో బోర్ కొట్టించాడు. ప్రీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ మరియు యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమా ని కాపాడలేకపోయాయి.

చివరిగా సీత సినిమా మరలా తేజ స్టైల్ లో ఉన్న ఒక నిరాశాభరితమైన చిత్రం.

Tags:    
Advertisement

Similar News