సాహో విడుదల పై.... క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమా అయిన ‘సాహో’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనుంది. గత కొంత కాలంగా ఈ సినిమా విడుదల తేదీపై బోలెడు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా వాయిదా పడనుందని కూడా […]

Advertisement
Update: 2019-05-21 02:06 GMT

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమా అయిన ‘సాహో’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనుంది.

గత కొంత కాలంగా ఈ సినిమా విడుదల తేదీపై బోలెడు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా వాయిదా పడనుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రభాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు.

అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని నిన్న సోషల్ మీడియా ద్వారా తెలిపిన ప్రభాస్ ఇవాళ ‘సాహో’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు. ఆ పోస్టర్ ద్వారా సినిమా అధికారికంగా విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇచ్చారు దర్శకనిర్మాతలు.

అనుకున్న విధంగానే ఈ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ స్టైలిష్ గా పోజిస్తున్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Here it is darlings, for all of you… The new official poster of my next film Saaho. See you in theatres on 15th August!

Posted by Prabhas on Monday, 20 May 2019

Tags:    
Advertisement

Similar News