ద్యుతీ చంద్ పై అమ్మానాన్నల గరంగరం

సాటిమహిళను పెళ్లాడతాన్న ద్యుతీపై ఆగ్రహం తమను పట్టించుకోడం లేదంటూ ఆవేదన 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఏం చేసిందోనంటూ ఆందోళన గత మూడేళ్లుగా ఓ మహిళతో కలిసి తాను సహజీవనం చేస్తున్నానని…త్వరలోనే జీవిత భాగస్వామిగా చేసుకొంటానంటూ ప్రకటించిన భారత మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ కు తొలిసారిగా ఇంటి సెగ తగలింది. తమకు తెలియకుండా…తమను సంప్రదించకుండా ద్యుతీ సాటి మహిళను వివాహమాడటం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. మహిళ పురుషుడిని మాత్రమే వివాహమాడాలని…సాటి మహిళను కాదని ద్యుతీ చంద్ తల్లి […]

Advertisement
Update:2019-05-20 09:05 IST
  • సాటిమహిళను పెళ్లాడతాన్న ద్యుతీపై ఆగ్రహం
  • తమను పట్టించుకోడం లేదంటూ ఆవేదన
  • 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఏం చేసిందోనంటూ ఆందోళన

గత మూడేళ్లుగా ఓ మహిళతో కలిసి తాను సహజీవనం చేస్తున్నానని…త్వరలోనే జీవిత భాగస్వామిగా చేసుకొంటానంటూ ప్రకటించిన భారత మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ కు తొలిసారిగా ఇంటి సెగ తగలింది.

తమకు తెలియకుండా…తమను సంప్రదించకుండా ద్యుతీ సాటి మహిళను వివాహమాడటం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. మహిళ పురుషుడిని మాత్రమే వివాహమాడాలని…సాటి మహిళను కాదని ద్యుతీ చంద్ తల్లి అకుజీ చంద్ గట్టిగా చెబుతోంది.

3 కోట్ల ప్రైజ్ మనీ పై నిలదీత…

జాజ్ పూర్ జిల్లా చకా గోపాల్ పూర్ గ్రామంలోని ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీ చంద్ కు ఆరుగురు అక్కాచెల్లెళ్లున్నారు.

దుత్యీ ఓ అథ్లెట్ గా ఎదగడానికి ఆమె కుటుంబసభ్యులు ఎన్నో త్యాగాలు చేశారు. కష్టనష్టాలు సైతం భరించారు.

గత ఆసియాక్రీడల మహిళల 100, 200మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించడం ద్వారా…ద్యుతీ చంద్ వివిధ రూపాలలో 3 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి సంపాదించింది.

అయితే…ఈ మొత్తంలో కనీసం పైసా కూడా తమకు ద్యుతీ చంద్ ఇవ్వలేదని…తమను పట్టించుకోకుండా ఓ స్నేహితురాలి వలలో పడి.. చివరకు ఆమెనే పెళ్లాడే వరకూ వచ్చిందని ద్యుతీ తల్లి వాపోతోంది.

మరోవైపు…ద్యుతీ సోదరి, మాజీ రన్నర్ సరస్వతి సైతం…ద్యుతీ చంద్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి.. ద్యుతీ కుటుంబానికి దూరమయ్యిందని…ద్యుతీ సంపాదన వైపే అమ్మానాన్నలు సైతం చూస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

లెస్బియన్ గా మారిన ద్యుతీ చంద్

23 ఏళ్ల ద్యుతీ చంద్ గత మూడేళ్లుగా తమ గ్రామానికే చెందిన ఓ యువతితో కలసి సహజీవనం చేస్తోంది. తమ అభిప్రాయాలు కలిశాయని.. తాను త్వరలోనే స్నేహితురాలిని జీవితభాగస్వామిగా చేసుకొంటానని ప్రకటించింది. మహిళను సాటి మహిళ పెళ్లాడటం, జీవితభాగస్వామిగా చేసుకోడం ఏమాత్రం తప్పుకాదని…గత ఏడాది సెప్టెంబర్లోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో స్వలింగసంపర్కులకు ఎక్కడలేని స్వేచ్ఛ వచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొనే ద్యుతీ తన మనసులో మాట బయటపెట్టింది. భారత రాజ్యాంగ్యం కల్పించిన హక్కును తాను వినియోగించుకొంటానని…తన వ్యక్తిగత విషయాలు, నిర్ణయాలతో మిగిలినవారికి ఏమాత్రం సంబంధం లేదని ద్యుతీ తెగేసి చెప్పింది.

తన కుటుంబసభ్యులకు తెలియకుండా గత మూడేళ్లుగా సాటి మహిళతో కలిసి కాపురం చేస్తున్న ద్యుతీ చంద్..నిర్ణయాన్ని ఇప్పుడు ఆమెను కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులే తప్పుపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News