మళ్ళీ మొదటికొచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మొదలు కాగానే కుటుంబంతో సహా వెళ్ళి ఓటేసి వచ్చిన చంద్రబాబు ఇంక్ మార్క్ పెట్టిన తన చూపుడు వేలును చూపిస్తూ మీడియా ముందు మందహాసం చేసిన చంద్రబాబు…. రెండు గంటలు గడిచేసరికి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తున్నారో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందగానే…. ఈవీఎంల మీద మండిపడ్డాడు. 33 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కోప్పడ్డాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వాడిన మొత్తం 98,000 ఈవీఎంలలో మూడు వందల ఈవీఎంలు మొదట […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మొదలు కాగానే కుటుంబంతో సహా వెళ్ళి ఓటేసి వచ్చిన చంద్రబాబు ఇంక్ మార్క్ పెట్టిన తన చూపుడు వేలును చూపిస్తూ మీడియా ముందు మందహాసం చేసిన చంద్రబాబు…. రెండు గంటలు గడిచేసరికి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తున్నారో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందగానే…. ఈవీఎంల మీద మండిపడ్డాడు. 33 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కోప్పడ్డాడు.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వాడిన మొత్తం 98,000 ఈవీఎంలలో మూడు వందల ఈవీఎంలు మొదట మొరాయించాయి. దానికి కారణం సిబ్బందికి ఈవీఎంల వాడకం మీద అవగాహన లేకపోవడమేనని తరువాత తెలిసింది. మొత్తంగా సుమారు 40 ఈవీఎంలు నిజంగానే మొరాయించాయి. వాటిని సరిదిద్ది, మార్చి ఎన్నికలను నిర్వహించడానికి కొంత టైం పట్టింది. వాస్తవం ఇది. లక్ష ఈవీఎంలు వాడితే 40 ఫెయిల్ కావడం ఎక్కడైనా జరిగేదే… అయితే అప్పటినుంచి ఇప్పటి దాకా ఈవీఎంల మీద చంద్రబాబు మాత్రం విమర్శలు మానలేదు. ఏది ఎలా ఉన్నా నూటికి నూరు శాతం తామే గెలుస్తామన్న ప్రకటనా మానలేదు.
వీవీ ప్యాట్‌లను సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 5 బూత్‌లవి కాకుండా 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని అమరావతి నుంచి ఢిల్లీ దాకా తన నిరసన గళం వినిపించాడు. నిన్న ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బయటకు రాగానే చంద్రబాబు మళ్ళీ మొదటికొచ్చాడు. నిన్నటిదాకా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం నుంచి వీవీ ప్యాట్‌ల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఒకవైపు తన వల్లే వీవీ ప్యాట్‌లు వినియోగంలోకి వచ్చాయని చెబుతూనే…. వీవీ ప్యాట్‌లను కూడా ట్యాంపరింగ్ (మేనేజ్) చేయవచ్చని అంటున్నాడు. అలా అంటూనే టీడీపీ నూటికి వెయ్యి శాతం గెలుస్తుందని, దీనిలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధీమాగా చెబుతున్నానని దీనిలో జీరో పర్సెంట్ కూడా అనుమానం లేదంటున్నాడు చంద్రబాబు.
ఎప్పటిలాగే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా ఈవీఎంలపై, వీవీ ప్యాట్‌ల లెక్కింపు పై, ఎన్నికల కమిషన్ పై కామెంట్స్ చేస్తూనే…. ఈవీఎంలనే కాదు… వీవీప్యాట్ ప్రింటర్‌లను మేనేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొత్త అనుమానాలను లేవనెత్తారు చంద్రబాబు.
వీవీ ప్యాట్ స్లిప్‌లను కేవలం మూడు సెకన్లు మాత్రమే స్క్రీన్ పై చూడగలమని… ఓటర్ కు ఆ సమయం సరిపోదని…. ఆ స్లిప్‌ను ఓటర్ చేతికి వచ్చేలా చేయాలని…. ఓటర్ ఆ స్లిప్‌ను చూసి ఓకే అనుకున్నాక…. వీవీప్యాట్ స్లిప్‌ను బ్యాలెట్ బాక్సులో వేసేలా కొత్త రూల్స్ తేవాలన్నారు చంద్రబాబు.
టెక్నాలజీకి బానిసగా మారి బలిపశువులు కావొద్దన్నారు చంద్రబాబు. గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదని… తనలాంటి వారి పోరాటం వల్లే వీవీప్యాట్‌లు వచ్చాయన్నారు. ఎన్నికల్లో పారదర్శకత ఉండాలని… వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి అభ్యంతరమేంటి? అని ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. 5 బూత్‌లను కౌంట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని… తాము 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలని కోరామని దానికి అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు చంద్రబాబు.
మే 23 ఓట్ల లెక్కింపులో గొడవలు జరుగుతాయన్న కేంద్ర ఇంటెలిజెన్స్ సూచించడంతో ఏపీకి కేంద్ర బలగాల్ని పంపించడానికి సిద్ధమైంది. అయితే దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అవసరమైనప్పుడు కేంద్ర బలగాల్ని పంపలేదని, ఇప్పుడు పంపుతున్నారని… అన్నారు చంద్రబాబు.