కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ టార్గెట్ ఈ ముగ్గురే.... 

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ గీస్తోంది. తటస్థంగా ఉన్న ముగ్గురు కీలక నేతలకు, వారి పార్టీలకు గాలం వేస్తోంది. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసైనా సరే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానియ్యకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది.  ఇందుకోసం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దెనెక్కించ కూడదని ప్లాన్ చేస్తోంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తూ […]

Advertisement
Update:2019-05-17 07:29 IST

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ గీస్తోంది. తటస్థంగా ఉన్న ముగ్గురు కీలక నేతలకు, వారి పార్టీలకు గాలం వేస్తోంది. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసైనా సరే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానియ్యకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దెనెక్కించ కూడదని ప్లాన్ చేస్తోంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తూ రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలకు సోనియా గాలం వేస్తున్నారు.

ఈపనికోసం మధ్యప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ను రంగంలోకి దింపారు.

తెలంగాణ, ఒడిషా, ఏపీ రాష్ట్రాల బాధ్యతను కమల్ నాథ్ కు సోనియా అప్పగించారట. కమల్ నాథ్ మే 23న ఫలితాలు వెలువడగానే సమీకరణాలను బట్టి తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, వైసీపీ అధినేత జగన్ తో అనధికారికంగా తొలుత చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

ఈ ముగ్గురు అటు బీజేపీకి, ఇటు యూపీఏకి మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉంటున్నారు.

వీరి ముగ్గురి కోరికలను, డిమాండ్లను బేరిజు వేసుకొని కేంద్రంలో వీరికి పదవులు ఇవ్వడంతోపాటు హామీలు ఇచ్చి కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావిస్తోంది. కాంగ్రెస్ కు ప్రధాని పదవి రాకపోయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతునిచ్చి అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News