తెలుగు మహిళా క్రికెటర్ కు అరుదైన గౌరవం

భారత తొలి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా లక్ష్మి ఆంధ్ర క్రికెట్ నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన లక్ష్మి రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చాటుకోడానికి తహతహలాడుతున్నారు. క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళలకు సైతం అవకాశాలు కల్పించాలన్న ఐసీసీ వ్యూహంలో భాగంగా…సమర్థులు, ప్రతిభావంతులైన మాజీ మహిళా క్రికెటర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే మహిళలను సైతం మ్యాచ్ రిఫరీలుగా నియమిస్తోంది. ఐసీసీ తాజాగా […]

Advertisement
Update:2019-05-15 04:36 IST
  • భారత తొలి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా లక్ష్మి
  • ఆంధ్ర క్రికెట్ నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన లక్ష్మి

రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చాటుకోడానికి తహతహలాడుతున్నారు.

క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళలకు సైతం అవకాశాలు కల్పించాలన్న ఐసీసీ వ్యూహంలో భాగంగా…సమర్థులు, ప్రతిభావంతులైన మాజీ మహిళా క్రికెటర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న పట్టుదలతో ఉంది.

అందులో భాగంగానే మహిళలను సైతం మ్యాచ్ రిఫరీలుగా నియమిస్తోంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన మ్యాచ్ రిఫరీల జాబితాలో
ఆంధ్ర మాజీ క్రికెటర్ జీఎస్ లక్ష్మి చోటు సంపాదించింది.

భారత తొలిమహిళ లక్ష్మి…

ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన భారత తొలి మహిళ ఘనతను ఓ ఆంధ్ర క్రికెటర్ దక్కించుకోవడం…. తెలుగురాష్ట్రాల మహిళలకు
దక్కిన అరుదైన గౌరవంగా మిగిలిపోతుంది.

51 సంవత్సరాల లక్ష్మికి క్రికెటర్ గా, అంపైర్ గా, మ్యాచ్ రిఫరీగా అపారఅనుభవం ఉంది. 1986 నుంచి 2004 వరకూ ఆంధ్ర, సౌత్ సెంట్రల్ రైల్వే, బీహార్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లకు ఆల్ రౌండర్ గా ఆడిన రికార్డు లక్ష్మికి మాత్రమే సొంతం.

అవుట్ స్వింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా సుదీర్ఘ కెరియర్ కొనసాగించిన లక్ష్మి…రిటైర్మెంట్ తర్వాత…మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టింది. 2008-09 సీజన్లో భారత దేశవాళీ క్రికెట్లో తొలిసారిగా మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది.

అంతర్జాతీయస్థాయిలో మూడువన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లకు మ్యాచ్ రిఫరీగా సేవలు అందించడం ద్వారా ఐసీసీ గుర్తింపు సంపాదించింది.

ఐసీసీ మ్యాచ్ రిఫరీగా రెండో మహిళ…

ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్, వన్డే, టీ-20 మ్యాచ్ లు జరిగే సమయంలో ఫీల్డ్ అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించినా…మ్యాచ్ సజావుగా సాగటంలో మ్యాచ్ రిఫరీనే కీలకంగా వ్యవహరిస్తారు. మ్యాచ్ నిర్వహణ బాధ్యత ప్రధానంగా మ్యాచ్ రిఫరీపైనే ఉంటుంది.

మహిళా క్రికెట్లో గతంలో పురుషులే మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే వారు. అయితే …ఐసీసీ మాత్రం వివిధ దేశాలకు చెందిన సమర్థవంతులైన మాజీ మహిళా క్రికెటర్లకు పరీక్షలు నిర్వహిస్తూ మ్యాచ్ రిఫరీలుగా ఎంపిక చేస్తూ వస్తోంది.

మహిళా తొలిమ్యాచ్ రిఫరీ క్లెయిర్

ఐసీసీ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టిన తొలిమహిళగా క్లెయిర్ పోలోసాక్ చరిత్ర సృష్టించింది. ఏకంగా ఓ పురుషుల మ్యాచ్ కే మ్యాచ్ రిఫరీగా క్లెయిర్ వ్యవహరించింది.

ఇప్పుడు మన తెలుగు మహిళ లక్ష్మికి సైతం ఆ అవకాశం దక్కింది. క్రికెటర్ గా, మ్యాచ్ రిఫరీగా తన అపార అనుభవాన్ని ఉపయోగించి.. ఐసీసీ మ్యాచ్ రిఫరీగా రాణించగలనన్న ధీమాను లక్ష్మి వ్యక్తం చేసింది.

మ్యాచ్ రిఫరీగా ఎంపికైన భారత తొలిమహిళగా నిలవడం తన అదృష్టమని, భారత మహిళలకే గర్వకారణమని లక్ష్మి మురిసిపోతోంది.

తన కుటుంబసభ్యుల ప్రోత్సాహం, బీసీసీఐ అండదండల కారణంగానే తాను ఈస్థాయికి ఎదగగలిగానని..పురుషుల మ్యాచ్ లకు సైతం మ్యాచ్ రిఫరీగా వ్యవహరించడానికి ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

ఇదిలాఉంటే…ఐసీసీ అంపైర్ల మహిళా ప్యానెల్ సంఖ్య రికార్డు స్థాయిలో ఎనిమిదికి చేరింది. మహిళా అంపైర్ల ప్యానెల్ లో చేరినవారిలో ఇలోసీ షెర్డాన్, లారెన్ అగెన్ బాగ్, కిమ్ కాటన్, శివానీ మిశ్రా, సు రెడ్ ఫెర్న్, మేరీ వాల్డ్ రాన్, జాక్వెలైన్ విలియమ్స్, క్లెయిర్ పోలోసాక్ ఉన్నారు.

ఆంధ్ర క్రికెట్ నుంచి ఐసీసీ మ్యాచ్ రిఫరీ స్థాయికి ఎదిగిన భారత తొలి మహిళగా ఓ తెలుగు వనిత నిలవడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News