ఐపీఎల్ లో వికెట్ కీపర్ గా ధోనీ అరుదైన రికార్డు
అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ గా ధోనీ ఫైనల్లో ముంబై ఓపెనర్లను అవుట్ చేసిన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ…ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ముగిసిన 2019 సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ పై ఈ ఘనత సాధించాడు. దటీజ్ ధోనీ…. ప్రపంచక్రికెట్లో మాత్రమే కాదు…ఐపీఎల్ లో సైతం జార్ఖండ్ డైనమైట్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ […]
- అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ గా ధోనీ
- ఫైనల్లో ముంబై ఓపెనర్లను అవుట్ చేసిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ…ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.
హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ముగిసిన 2019 సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ పై ఈ ఘనత సాధించాడు.
దటీజ్ ధోనీ….
ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో వికెట్ కీపర్ గా 132 మందిని అవుట్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా ముంబైతో ముగిసిన టైటిల్ సమరంలో ధోనీ… ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీ కాక్ లను అవుట్ చేయడం ద్వారా రికార్డుల్లో చేరాడు.
ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 190 మ్యాచ్ ల్లో …ధోనీ 94 క్యాచ్ లు, 38 స్టంపింగ్స్ సాధించాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 182 మ్యాచ్ ల్లో 131 మందిని, రాబిన్ ఊతప్ప 177 మ్యాచ్ ల్లో 90 మందిని అవుట్ చేసి మొదటి మూడు స్థానాలలో నిలిచారు.
ఇప్పటికే వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ…ఐపీఎల్ లో సైతం నంబర్ వన్ వికెట్ కీపర్ గా సత్తా చాటుకొన్నాడు.
అంతేకాదు…ఎనిమిది ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అరుదైన రికార్డును సైతం ధోనీ సొంతం చేసుకొన్నాడు.