పాయే... ఉత్తరాంధ్ర కూడా పాయే...!

రాజధాని పరిధిలోకి వచ్చే గుంటూరు, విజయవాడ, కృష్టా జిల్లాలతో పాటుగా, ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి ఆయువు పట్టులాంటి వని, ఇక్కడే తమకు అత్యధిక సీట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న నివేదికలు బాబు ఆశల మీద నీళ్లు చల్లాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో విశాఖ మినహాయిస్తే మిగతా జిల్లాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమీక్షలో ఈ విషయం స్పష్టమైందని అంటున్నారు. ఇక్కడి నుంచి పలువురు […]

Advertisement
Update:2019-05-11 09:30 IST

రాజధాని పరిధిలోకి వచ్చే గుంటూరు, విజయవాడ, కృష్టా జిల్లాలతో పాటుగా, ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి ఆయువు పట్టులాంటి వని, ఇక్కడే తమకు అత్యధిక సీట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న నివేదికలు బాబు ఆశల మీద నీళ్లు చల్లాయని తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలో విశాఖ మినహాయిస్తే మిగతా జిల్లాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమీక్షలో ఈ విషయం స్పష్టమైందని అంటున్నారు.

ఇక్కడి నుంచి పలువురు అభ్యర్థులు నివేదికలు కూడా ఇవ్వలేదని, మౌఖికంగానే చంద్రబాబుకు పరిస్థితులను వివరించారని సమాచారం. గెలుపు అవకాశాలు ఉన్నాయని తాము భావించడం లేదని తెలుగు తమ్ముళ్లు అధినేతకు విన్నవించినట్టుగా తెలుస్తోంది.

అంతా విన్న చంద్రబాబు ఎప్పటిలాగే శ్రీకాకుళంలో తామే గెలుస్తామని, రాష్ట్రంలో దాదాపు 110 నుంచి 120 వరకు సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ శ్రేణులకు వివరించారని తెలిసింది.

వైఎస్ఆర్ సీపీ విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిందని, ఆ డబ్బులు తీసుకున్నవారంతా తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని, అందుకు తమ సంక్షేమ పథకాలే కారణమని చెప్పినట్టుగా తెలుస్తోంది.

అధినేత అలా మాట్లాడుతుంటే ఏమనాలో తెలియక నేతలు మిన్నకుండిపోయారని చెబుతున్నారు. బాబు పైకి గంభీరంగా ఏం మాట్లాడినా, నివేదికలను చూసి లోలోపల ఒకింత ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. తన సన్నిహితుల వద్ద బాబు చేస్తున్న వ్యాఖ్యానాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

పోలరైజేషన్ లో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను పోలింగ్ కేంద్రాల వద్దకు నడిపించి టీడీపీకి ఓట్లు వేయించడంలో క్షేత్రస్థాయి నేతలు విఫలమయ్యారని బాబు మండి పడుతున్నట్టు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయని తాజాగా అందుతున్న నివేదికలు కూడా చంద్రబాబులో కలవరం కలిగిస్తున్నాయని అంటున్నారు.

స్థానిక నేతలు ఇచ్చే నివేదికల మీద నమ్మకం కుదరని చంద్రబాబు పదే పదే వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారని
చెబుతున్నారు. పసుపు కుంకుమ లబ్ధిదారులు అయిన మహిళలు తమకే ఓటు వేశారని ఆయన ఢంకా బజాయించి మరీ చెబుతున్నారట.. తమ అధినేత పరిస్థితికి సీనియర్ నాయకులు సైతం హతవిధీ.. అనుకుంటున్నారట..!

Tags:    
Advertisement

Similar News