రేపు తమముందు హాజరు కావాలని నోటీసు జారీ

అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేయడంతో రవిప్రకాష్‌ కు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు పోలీసులు. రవిప్రకాష్‌ ఇంటిలో సోదాల అనంతరం ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. రవిప్రకాష్‌ పరారీలో ఉండటంతో ఆయన భార్యకు ఈ నోటీసులను అందజేశారు. రేపు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అంతే కాకుండా రవిప్రకాష్ పాస్ పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రవిప్రకాష్‌తో పాటు నటుడు శివాజీకి కూడా […]

Advertisement
Update:2019-05-09 13:48 IST

అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేయడంతో రవిప్రకాష్‌ కు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు పోలీసులు. రవిప్రకాష్‌ ఇంటిలో సోదాల అనంతరం ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. రవిప్రకాష్‌ పరారీలో ఉండటంతో ఆయన భార్యకు ఈ నోటీసులను అందజేశారు. రేపు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
అంతే కాకుండా రవిప్రకాష్ పాస్ పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

రవిప్రకాష్‌తో పాటు నటుడు శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. నోటీసులు ఇవ్వడానికి నారాయణగూడలోని శివాజీ ఇంటికి వెళ్ళిన పోలీసులు…. శివాజీ పరారీలో ఉండడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు.

అయితే గత ఏడాది ఆగస్టు 23న అలంద మీడియా టీవీ9లో 90 శాతం వాటా కొనుగోలు చేసింది. యాజమాన్యం చేతులు మారడంతో సంస్థలో నలుగురు డైరెక్టర్లను నియమించేందుకు కేంద్ర సమాచార శాఖ అనుమతి కూడా తీసుకుంది అలంద మీడియా. అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్‌ అడ్డుపడుతున్నాడట. ఇందులో భాగంగానే కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు, పాత తేదీతో రవిప్రకాష్‌ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు చెబుతున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో రవిప్రకాశ్‌ను టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగించింది యాజమాన్యం. సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు టీవీ9 ఆఫీసులోని ముఖ్యమైన ఫైళ్ళు, హార్డ్‌ డిస్క్‌లు రవిప్రకాష్‌ మాయం చేశాడన్న కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి….. 8శాతం వాటా ఉన్న రవిప్రకాశ్‌ అడ్డుతగులుతూ… మెజారిటీ వాటాదారుల హక్కులు కాలరాస్తున్నారంటున్నారు.

దీంతో టీవీ9 కొత్త యాజమాన్యం ఫిర్యాదుతో రవిప్రకాష్‌ పై సీపీ 406, 420, 467, 469, 471, 120 బి, ఐటీ యాక్ట్‌ 66, 90, 72 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఈ నేపథ్యంలోనే సీఆర్‌పీసీ 160 కింద రేపు ఉదయం తమముందు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు పోలీసులు.

Tags:    
Advertisement

Similar News